- ఈ ఏడాదిలో 17 మంది బలవన్మరణం
జైపూర్: రాజస్థాన్‌లోని కోటా జిల్లాలో మరో స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. బిహార్‌లోని వైశాలి జిల్లాకు చెందిన బాలుడు (16) కోటాలోని విజ్ఞాన్ నగర్‌లోని వెల్‌కమ్ ప్రైమ్ హాస్టల్‌లో 8 నెలలుగా ఉంటూ జేఈఈ కోచింగ్ తీసుకుంటున్నాడు. బాలుడి తల్లిదండ్రులు శుక్రవారం రాత్రి 10.30 గంటల సమయంలో ఫోన్ చేశారు. పలుమార్లు చేసినా ఫోన్ ఎత్తకపోవడంతో హాస్టల్ నిర్వాహకులకు ఫోన్ చేసి చెప్పారు.
వెంటనే వారు రూమ్‌కు వెళ్లి చూడగా, లోపల నుంచి గడియ పెట్టి ఉంది. దీంతో డోర్‌ను బలవంతంగా తెరవగా లోపల బాలుడు ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. చదువులో వెనుకబడుతుండటం, ఒత్తిడి తట్టుకోలేకపోవడం వల్లే ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు. బాలుడు ఎక్కువగా తన తండ్రి, తాతతోనే మాట్లాడేవాడని తెలిసింది.