
హైదరాబాద్, వెలుగు: జేఈఈ మెయిన్ 2 ఫలితాలను శనివారం విడుదల చేయనున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వెల్లడించింది. గురువారం 'కీ'ని రిలీజ్ చేసి, వెంటనే డిలీట్ చేసిన ఎన్టీఏ.. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు మళ్లీ జేఈఈ మెయిన్ 2 'కీ'ని అధికారిక వెబ్ సైట్ ద్వారా వెల్లడించింది. అనంతరం శనివారం జేఈఈ మెయిన్ 2 ఫలితాలను రిలీజ్ చేస్తామని ఓ ప్రకటనను విడుదల చేసింది. కాగా..జనవరిలో జేఈఈ మెయిన్1 ఎగ్జామ్ జరగ్గా.. ఏప్రిల్ 2 నుంచి 9 వరకు మెయిన్ 2 పరీక్షలు జరిగాయి. ఈ రెండింటిలో టాప్ స్కోర్ సాధించిన రెండున్నర లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్ డ్ కు ఎంపిక చేయనున్నారు.