ఎన్ఐటీల్లో బీటెక్‌కు జేఈఈ మెయిన్.. జనవరిలో తొలి విడత పరీక్షలు

ఎన్ఐటీల్లో బీటెక్‌కు జేఈఈ మెయిన్.. జనవరిలో తొలి విడత పరీక్షలు

రెండు సంవత్సరాల భగీరథ ప్రయత్నంతో దేశవ్యాప్తంగా కనీసం 12 లక్షల మంది పోటీ పడే పరీక్ష జేఈఈ మెయిన్‍. దేశవ్యాప్తంగా ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐటీల్లో బీటెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌/ బీఆర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీట్ల భర్తీకి జేఈఈ మెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-2025 తొలి విడత పరీక్షలు జనవరి 22 నుంచి, రెండో విడత పరీక్షలు ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 1 నుంచి జరగనున్నాయి. జేఈఈ మెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-1, 2లకు కలిపి గత సంవత్సరం 12.30 లక్షల మంది దరఖాస్తు చేశారు. షార్ట్ టర్మ్, లాంగ్‍టర్మ్, ఫస్ట్ అటెంప్ట్ ఏదైనా సరైన ప్రణాళిక, నిరంతర శ్రమ ఉంటే ఇందులో విజయం సాధించవచ్చు. ఈ నేపథ్యంలో ప్రిపరేషన్​ ప్లాన్​, సిలబస్​, ఎగ్జామ్​ గురించి తెలుసుకుందాం..

దేశవ్యాప్తంగా ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐటీలు, ట్రిపుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐటీల్లో బీటెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీట్లను జేఈఈ మెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేస్తారు. ఐఐటీల్లో బీటెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేరాలంటే మెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉత్తీర్ణులైన వారు జేఈఈ అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాయాలి. జేఈఈ మెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కనీస మార్కులు సాధించి అర్హత పొందిన 2.50 లక్షల మందికి మాత్రమే అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరీక్ష రాసేందుకు అర్హత ఉంటుంది. జేఈఈ మెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ర్యాంకుల ఆధారంగా కొన్ని ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంజినీరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కళాశాలలు యాజమాన్య కోటా సీట్లను కేటాయిస్తాయి. దేశవ్యాప్తంగా 31 ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐటీల్లో 24 వేలకుపైగా, ట్రిపుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐటీల్లో 8,500లకుపైగా బీటెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీట్లున్నాయి. ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐటీల్లో 50 శాతం సీట్లు సొంత రాష్ట్రాల విద్యార్థులకు కేటాయిస్తారు.

అర్హత: అభ్యర్థులకు వయోపరిమితి లేదు. 2023, 2024లో 12వ తరగతి/తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు లేదా 2025లో వయస్సుతో సంబంధం లేకుండా 12వ తరగతి పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు జేఈఈ (మెయిన్)-2025 పరీక్షకు హాజరు కావచ్చు.

ఎగ్జామ్​ ప్యాటర్న్: పరీక్షలను తెలుగు, ఇంగ్లీష్​ సహా మొత్తం 13 భాషల్లో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లీష్ తో పాటు అభ్యర్థులు కోరుకున్న ప్రాంతీయ భాషలో  ఇస్తారు. పేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-1కు 300, పేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-2కు  400 మార్కులు ఉంటాయి. బీఆర్క్, బీ ప్లానింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అడ్మిషన్స్​కు  పేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-2, బీటెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీట్ల భర్తీకి పేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-1 పరీక్ష జరుపుతారు. బీఆర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 50 వేల లోపే దరఖాస్తులు వస్తాయి. ప్రశ్నపత్రాల్లో రెండు సెక్షన్లు ఉంటాయి. సెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-  బీలో ఈసారి 5 ప్రశ్నలు మాత్రమే ఇస్తారు. గత మూడేళ్ల మాదిరిగా ఈసారి ఛాయిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉండదు. రెండు సెక్షన్లలో మైనస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్కులుంటాయి. 

పరీక్షల షెడ్యూల్: తొలి విడతలో ఆన్​లైన్​ అప్లికేషన్స్​ అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 28 నుంచి నవంబరు 22 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పరీక్షలు జనవరి 22- నుంచి  జనవరి 31 మధ్య నిర్వహిస్తారు. ఫిబ్రవరి12 నాటికి ఫలితాలు ఇస్తారు. రెండో విడత దరఖాస్తులు జనవరి 31 నుంచి - ఫిబ్రవరి 24 వరకు అప్లై చేసుకోవాలి. ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 1 నుంచి- 8 మధ్య పరీక్ష నిర్వహించనున్నారు.  ఏప్రిల్​ 17 నాటికి రిజల్ట్స్​ ఇస్తారు. పూర్తి సమాచారం కోసం www.jeemain.nta.nic.in వెబ్​సైట్​లో సంప్రదించాలి. 

ప్రిపరేషన్​ టిప్స్: నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వచ్చినప్పటి నుంచే ప్రిపరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మొదలుపెట్టి ఉండాలి. జనవరిలో జరిగే పరీక్షకు ఇంకా రెండు నెలలు సమయం ఉంది కాబట్టి సబ్జెక్టుల వారీగా ప్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకోవాలి. రోజూ తరగతిలో విన్న పాఠాలు చదవడం, ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడంతో పాటు జేఈఈ కోసం ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఈఆర్టీ పుస్తకాలు చదవాలి. అకడమిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిలబస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జేఈఈ సిలబస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాలా వరకు ఒకే విధంగా ఉంటుంది కాబట్టి రెండింటికి ఏకకాలంలో సిద్దమవ్వాలి. మొదటి అటెంప్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తక్కువ మార్కులు వస్తే ఆందోళన చెందాల్సిన పని లేదు. అందులో చేసిన తప్పులను బేరీజు వేసుకొని ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరీక్షకు సిద్దమవ్వాలి. 

సిలబస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని టాపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కాన్సెప్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అప్లికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓరియంటేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధారంగా చదవాలి. ఇది బోర్డు పరీక్షలు, జేఈఈ  రెండింటికి ఉపయోగపడుతుంది. ప్రీవియస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేపర్లను ఖచ్చితంగా ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తూ అందులో అడిగిన ప్రశ్నల విధానం అర్థం చేసుకోవాలి. దాని ప్రకారం టాపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రిపేరవ్వాలి. మాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెస్టులు కూడా అభ్యర్థి సామార్థ్యాన్ని అంచనా వేసుకోవడానికి చాలా ఉపయోగపడతాయి. తోటి విద్యార్థులతో బృందంగా ఏర్పడి (పీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెర్నింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) చదవడం, కష్టమైన టాపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై చర్చించడం వల్ల కాన్సెప్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సులువుగా గుర్తుంటాయి. మళ్లీ మళ్లీ చదవడం, రాయడం వల్ల ఏ అంశమైనా ఎక్కువ కాలం గుర్తుంటుంది కాబట్టి ఎక్కువ పుస్తకాలు కాకుండా ఒకే పుస్తకం లేదా మెటీరియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎక్కువసార్లు రివిజన్​ చేస్తే మంచి స్కోర్​ వస్తుంది.

కామన్​ టాపిక్స్​: మెయిన్స్ స్థాయిలో రెండు లేదా మూడు భావన (కాన్సెప్ట్) లను కలిపి ఒక ప్రశ్నను తయారు చేస్తారు. ప్రశ్నను బాగా చదివి కాన్సెప్ట్ ను అర్థం చేసుకుంటేనే సమాధానం గుర్తించగలం. వీటి మధ్య అనుసంధానత ఉంటుంది కాబట్టి ఏ ఒక్క కాన్సెప్ట్ తెలియకపోయినా జవాబులు రాయడం కష్టం. ఎందుకంటే ఒక భావన అవుట్‍పుట్‍ మరో భావన ఇన్‍పుట్‍ అవుతుంది. దాదాపు అన్ని ప్రశ్నలకు ఒకే సరైన సమాధానం ఉండేలా ప్రశ్నలు రూపొందిస్తారు. జేఈఈ అడ్వాన్స్​డ్​లో  అయితే 5 లేదా 6 భావనలు కలిపి కూడా ప్రశ్నలు వస్తాయి. వీటికి రెండు లేదా మూడు సరైన సమాధానాలు ఉంటాయి. మెయిన్స్ లో పరీక్షా విధానం ఫిక్స్డ్​ గా ఉంటుంది. అడ్వాన్స్​డ్​లో ఏటా ప్రశ్నల సంఖ్య మారుతూ ఉంటుంది. ఈ అంశాలు మూడు సబ్జెక్టుల్లోని ప్రశ్నల్లో కామన్‍గా కనిపిస్తాయి.

డబుల్​ బెనిఫిట్స్: ఒకే సంవత్సరంలో రెండుసార్లు పరీక్ష రాసుకునే వెసులుబాటు ఉండటంతో రెండు ప్రయోజనాలున్నాయి. ఒకటి మంచి మార్కులు రాకపోతే అకడమిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంవత్సరం వృథా అవుతుందనే ఆందోళన అక్కర్లేదు. రెండోసారి ఏప్రిల్‍లో జరిగే పరీక్షకు హాజరై స్కోర్‍ పెంచుకోవచ్చు. ఏదైనా కారణంతో జనవరిలో పరీక్షే రాయలేకపోతే మరోసారి రాయవచ్చు. ఏ పరీక్షలో ఎక్కువ మార్కులు వస్తే దానిని పరిగణనలోకి తీసుకుంటారు. అకడమిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంవత్సరం మధ్యలోనే అంటే జనవరిలోనే పరీక్ష ఉండటం వల్ల రెండింటిపై దృష్టి పెట్టడం కష్టం కావచ్చు. కానీ ప్రణాళిక ప్రకారం ఒత్తిడి లేకుండా చదవగలిగితే విజయం సాధించవచ్చు. 

సిలబస్​ 

మ్యాథ్స్: మ్యాథ్స్ లో బేసిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంశాలపై పట్టు సాధించాలి. ఇందులో సంకీర్ణ సంఖ్యలు, సంభావ్యత, ద్విపద సిద్ధాంతం, ప్రమేయాలు, సదిశలు, వాటి జ్యామితీయ అనువర్తనాలు, వృత్తాలు, శంఖువులు, అవకలనాలు, సమాకలనాలు, అవధులు వాటి అనువర్తనాలు, అవకలన సమీకరణాలు, వాటి అనువర్తనాలు, వైశాల్యాలు, త్రిభుజాల ధర్మాలు, వృత్తాలు, విలోమ త్రికోణమితీయ ప్రమేయాలు, త్రికోణమితీయ సమీకరణాలు, సాంఖ్యక శాస్ర్తం నుంచి ప్రతి ఏడాది కనీసం ఒకటి లేదా రెండు ప్రశ్నలు వస్తున్నాయి. వీటిని బాగా చదివితే దాదాపు 90 శాతం సమాధానాలు గుర్తించే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు ఈ చాప్టర్లపై ప్రధానంగా దృష్టి పెట్టాలి. మిగిలిన 5 నుంచి 10 శాతం ప్రశ్నలు లాజికల్‍ రీజనింగ్‍, శ్రేఢులు వంటి అంశాల నుంచి వస్తాయి. అయితే అభ్యర్థులు ప్రధానంగా దృష్టి సారించాల్సిన అంశాలు క్యాలిక్యులస్‍, ఆల్‍జీబ్రా. కొన్నిసార్లు వీటి నుంచే దాదాపు 70 శాతం పైగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.మ్యాథ్స్ లో  వచ్చే మార్కులే మెరిట్‍ సాధించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. 

ఫిజిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: ఇందులో మెకానిక్స్ నుంచి 27 శాతం, మోడర్న్ మెకానిక్స్ 18, వేవ్‍ ఆప్టిక్స్ అండ్‍ ఎలక్ర్టోమాగ్నటిజమ్‍ 15, ఎలక్ర్టోస్టాటిక్స్, థర్మోడైనమిక్స్, అండ్‍ ఫ్లూయిడ్‍ మెకానిక్స్ నుంచి 40 శాతం ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఫిజిక్స్ లో కైనమాటిక్స్, ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మోషన్, వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎనర్జీ, రొటేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మోషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, థర్మల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాపర్టీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గ్రావిటేషన్‍, థర్మోడైనమిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆప్టిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎలక్ట్రోస్టాటిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కెపాసిటెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అటామిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫిజిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రో మాగ్నటిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆల్టర్నేటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటి టాపిక్‍లు ముఖ్యమైనవి. ఈ సబ్జెక్టులో ప్రశ్నలు అన్నీ అప్లికేషన్‍ ఓరియంటెడ్‍ లో ఉంటాయి.

కెమిస్ట్రీ: ఆర్గానిక్‍ కెమిస్ర్టీ నుంచి 38 శాతం, ఫిజికల్‍ కెమిస్ట్రీ నుంచి 32 శాతం, ఇనార్గానిక్‍ కెమిస్ట్రీ నుంచి 30 శాతం మార్కులు వచ్చే అవకాశం ఉంది. ఇందులో అయానుల సమతాస్థితి, కాలిగేటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాపర్టీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎలక్ట్రో కెమిస్ట్రీ,  రసాయన బంధం, పి-బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మూలకాలు, డి అండ్‍ ఎఫ్‍‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మూలకాలు, హైడ్రో కార్బన్లు, కోఆర్డినేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాంపౌండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్గానిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కెమిస్ట్రీ, ఫినాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రసాయన సమతాస్థితి వంటి చాప్టర్లు ముఖ్యమైనవి. రసాయన చర్యల్లో ఉత్పన్నం అయ్యే పదార్థాలు, చర్యల క్రమం వంటి అంశాలను ఎక్కువగా ప్రాక్టీస్‍ చేస్తే మంచిది.