జేఈఈ మెయిన్ ఫైనల్​కీ పెట్టి తీసేశారు.. ఎన్టీఏ తీరుతో అందోళనలో అభ్యర్థులు

జేఈఈ మెయిన్ ఫైనల్​కీ పెట్టి తీసేశారు..  ఎన్టీఏ తీరుతో అందోళనలో అభ్యర్థులు

హైదరాబాద్, వెలుగు: జేఈఈ మెయిన్– 2 ఫైనల్ కీ పై అయోమయం నెలకొన్నది. గురువారం సాయంత్రం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)  ఫైనల్​ కీని అధికారిక https://jeemain.nta.nic.in వెబ్​సైట్​ లో పెట్టింది. కొద్దిసేపటికే మళ్లీ దాన్ని డిలీట్ చేసింది. దీంతో రాత్రి వరకూ ఫలితాలు వస్తాయని ఎదురుచూసిన విద్యార్థులు, తల్లిదండ్రులకు నిరాశ ఎదురైంది.  

కీని ఎందుకు మళ్లీ డిలీట్ చేశారనే దానిపై ఎన్టీఏ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, జేఈఈ మెయిన్ 2 రిజల్ట్ తో పాటు మెయిన్ కటాఫ్ పర్సంటైల్, టాప్ ర్యాంకర్ల డేటాను రిలీజ్ చేయాల్సి ఉంది.  కాగా, ఈ నెల 2 నుంచి 9 వరకు జేఈఈ మెయిన్ –2 పరీక్షలు జరిగాయి. ఈ నెల 13 వరకు ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలను స్వీకరించారు. 

ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం ఫైనల్ కీ రిలీజ్ చేశారు. దీంట్లో రెండు క్వశ్చన్లను డిలీట్ చేసినట్టు ప్రకటించారు. అయితే, కాసేపటికే మెయిన్ ఫైనల్ కీని వెబ్ సైట్ నుంచి డిలీట్ చేశారు.