JEE మెయిన్ పేపర్ 2 ఫలితాలు విడుదల

JEE మెయిన్ పేపర్ 2 ఫలితాలు విడుదల

JEE మెయిన్ పేపర్ 2 ఫలితాలను ప్రకటించింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA). పేపర్ 2A(B.Arch) ,పేపర్ 2B(B. Planning) ఫలితాలను విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు NTA అధికారిక వెబ్ సైట్ jeemain.nta.ac.in వెబ్ సైట్ లో స్కోర్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు.  

JEE మెయిన్ 2025 పేపర్ 2 పరీక్షను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్దతిలో బీఆర్క్, బీప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశానికి మొదటి సెషన్ ను జనవరి 30న పరీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 15న ప్రిలిమినరీ కీ విడుద లచేశారు. ఫిబ్రవరి 22న తుది కీ విడుదల చేశారు. ఈరోజు ఫలితాలను అండుబాటులో ఉంచారు. 

అభ్యర్థులు అప్లికేషన్ నంబర్, పాస్ వర్డ్ తో పాటు క్యాప్చా కోడ్ ఎంటర్ చేయడం ద్వారాస్కోర్ కార్డు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ ను మొత్తం 13 భాషల్లో నిర్వహించారు. పేపర్ 2Aకు 63వేల481 మంది అభ్యర్థులు అప్లయ్ చేసుకోవాగా 44వేల 144 మంది పరీక్షకు హాజరయ్యారు. పేపర్ 2B కి 28వేల 335 మంది అప్లయ్ చేసుకోగా 18వేల 596మంది హాజరయ్యారు. 

దేశవ్యాప్తంగా ఉన్న వివిధ భాషలకు చెందిన అభ్యర్థులు రాసే లక్ష్యంతో బహుభాషా విధానంలో పరీక్ష నిర్వహించారు.