- రాష్ట్రంలో సుమారు లక్షన్నర మంది అటెండ్
- ఆలస్యంగా వచ్చిన స్టూడెంట్స్ను అనుమతించని అధికారులు
- ఫిజిక్స్ పేపర్ ఈజీగా, కెమిస్ట్రీ కొంత కఠినంగా ఉందన్న విద్యార్థులు
హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు ఎన్టీఏ నిర్వహిస్తున్న జేఈఈ మెయిన్ సెషన్ 1 ఎగ్జామ్స్ బుధవారం ప్రారంభమయ్యాయి. తెలంగాణలో సుమారు లక్షన్నర మంది ఈ పరీక్షలకు అటెండ్ అవుతున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు మార్నింగ్ షిప్ట్, మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఆఫ్టర్ నూన్ షిఫ్ట్ గా పరీక్షలు జరుగుతున్నాయి. కాగా, బుధవారం ఉదయం 7 గంటల నుంచే పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థుల సందడి మొదలైంది.
ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను సెంటర్లలోకి అనుమతించలేదు. తొలిరోజు పేపర్ మధ్యస్తంగా వచ్చిందని స్టూడెంట్లు చెప్తున్నారు. గతంలో జరిగిన పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలూ వచ్చినట్టు వారు పేర్కొన్నారు. ఫిజిక్స్ సబ్జెక్టు ఈజీగానే ఉందని, కెమిస్ర్టీ కొంత కఠినంగా ఉందని చెప్పారు. ఈ నెల 23, 24, 28, 29 తేదీల్లో ఐఐటీ, ఎన్ఐటీలో సీట్ల కోసం, 30న బీఆర్క్, బీ ప్లానింగ్ సీట్ల కోసం పరీక్షలు జరుగుతాయి.