జేఈఈ మెయిన్స్‌… 30 డేస్​ ప్లాన్​ 

ఎన్​ఐటీ, ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్స్​ – 2021 ​కు ఇంకా 30 రోజులే టైం ఉంది. ఈసారి నాలుగు విడతల్లో రాసే అవకాశం రావడం, న్యూమరికల్​ ప్రశ్నల్లో చాయిస్, లోకల్​ లాంగ్వేజ్​లో క్వశ్చన్​ పేపర్​ ఇవన్నీ స్టూడెంట్స్​కు కలిసొచ్చే అంశాలు. ఎగ్జామ్​కు ఉన్న ఈ 30 డేస్​ టైంను ఎలా ప్లాన్​ చేసుకోవాలి.., సబ్జెక్టుల వారీగా ఇంపార్టెంట్​ చాప్టర్స్​ ఏమున్నాయి.. తదితర అంశాలపై సబ్జెక్ట్​ ఎక్స్​పర్ట్​ గైడెన్స్​ ఈ వారం.

ఫిబ్రవరి 1 నుంచి కాలేజీలు ప్రారంభం కాబోతున్నాయి. స్టూడెంట్స్​ అందరూ ఉన్న ఈ తక్కువ టైంను జేఈఈ మెయిన్స్​తోపాటు ఇంటర్మీడియట్​ బోర్డ్​  ఎగ్జామ్స్​కు సరిగ్గా  ప్లాన్​ చేసుకోవాలి. ఫిబ్రవరి, మార్చి, మే నెలల్లో జరగబోయే జీఈఈ మెయిన్స్​పై ఎక్కువ ఫోకస్​ పెట్టాలి. ఈ మూడు సార్లు తప్పనిసరిగా రాయడం వల్ల స్టూడెంట్​కు ఎక్కువ ఉపయోగం ఉంటుంది. ఫిబ్రవరిలో జరిగే జేఈఈ మెయిన్స్​ మొదటి విడత పరీక్షకు సుమారు 30 రోజుల టైం ఉంది. ఈ సమయాన్ని కరెక్ట్ గా​ ప్లాన్​ చేసుకొని ప్రిపరేషన్​ మొదలు పెట్టాలి. 30 డేస్​ను మూడు భాగాలుగా విభజించుకోవాలి.

  • మొదటి పది రోజులు ఇంటర్మీడియట్​ ఫస్ట్​ ఇయర్​ సిలబస్​లోని ముఖ్యమైన అధ్యాయాలను ప్రాక్టీస్​ చేయాలి.
  • తర్వాతి పది రోజులనుఇంటర్మీడియట్​ సెకండ్​ ఇయర్​ సిలబస్​లోని ఇంపార్టెంట్​ చాప్టర్స్​ చదివేందుకు కేటాయించాలి.
  • మిగిలిన పది రోజుల్లో జేఈఈ మెయిన్స్​ మాక్​ గ్రాండ్​ టెస్ట్​లను సాధన చేయాలి.

ఇవీ మారాయి..

​ ప్రవేశ పరీక్షలో నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ(ఎన్​టీఏ) ఈ సంవత్సరం కొన్ని మార్పులు చేసింది.  గత రెండు సంవత్సరాల నుంచి జేఈఈ మెయిన్స్​  ఏడాదికి రెండు సార్లు చొప్పున నిర్వహించారు. జనవరిలో మొదటి విడత, ఏప్రిల్​లో రెండో విడత పరీక్ష నిర్వహించి ఈ రెండు దఫాల్లో ఎందులో ఎక్కువ పర్సంటైల్​ వస్తే దాన్ని తుది స్కోరుగా తీసుకొని ర్యాంకింగ్​ను ప్రకటిస్తున్నారు.  ఈ సంవత్సరం ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా జేఈఈ మెయిన్స్​ను నాలుగు సార్లు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్​, మే నెలల్లో ఎగ్జామ్​ ఉంటుంది. స్టూడెంట్​ నాలుగు సార్లలో ఎన్ని సార్లైనా ఎగ్జామ్​ రాయొచ్చు. అటెండ్​ అయిన ప్రవేశ పరీక్షల్లో దేనిలో ఎక్కువ పర్సంటైల్​ వస్తే దాన్నే పరిగణనలోకి తీసుకొని ర్యాంకింగ్​ ఇస్తారు.  మొదటిసారిగా మాతృభాషలో కూడా జేఈఈ రాసే  చాన్స్​ ఇచ్చారు. ఇంగ్లిష్​, హిందీ​తోపాటు  ప్రాంతీయ భాషల్లో కూడా క్వశ్చన్​ పేపర్​ రూపొందిస్తారు. ఈ ఏడాది కొత్తగా న్యూమరికల్​ ఆన్సర్​ టైప్​ ప్రశ్నల్లో చాయిస్​ ప్రవేశపెట్టారు. ప్రతి సబ్జెక్ట్​లో10 న్యూమరికల్​ ఆన్సర్​ టైప్​ ప్రశ్నలు ఇస్తారు. వీటిలో ఏవైనా ఐదింటికి సరైన ఆన్సర్స్​ గుర్తించాలి. ప్రతి సబ్జెక్ట్​లో 30 ప్రశ్నల చొప్పున మొత్తం 90 ప్రశ్నలు ఇస్తారు. వాటి నుంచి ప్రతి సబ్జెక్ట్​లో 25 ప్రశ్నల చొప్పున మొత్తం 75 ప్రశ్నలకు ఆన్సర్​ చేయాల్సి ఉంటుంది. ప్రతి ప్రశ్నకు నాలుగు మార్కులు. న్యూమరికల్​ ఆన్సర్​ టైప్​ ప్రశ్నలకు నెగెటివ్​ మార్కులు లేవు.

క్వశ్చన్​ పేపర్​ స్థాయి

గత మూడు సంవత్సరాలలో జరిగిన  పరీక్షల క్వశ్చన్​ పేపర్స్​ను పరిశీలిస్తే ప్రశ్నల స్థాయి కొంత కఠినంగానే ఉంటోంది. అప్లికేషన్​ ఓరియెంటెడ్​లో ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నారు. కొన్ని ప్రశ్నలు లెంతీ క్యాలిక్యులేషన్స్​తో ఉంటున్నాయి. టైం  ఎక్కువ తీసుకొనే ప్రశ్నల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రిపరేషన్​లో ప్రాక్టీస్​ కూడా అదే స్థాయిలో కొనసాగించాలి. అప్పుడే అలాంటి ప్రశ్నలను వేగంగా సాధించగలం. మొత్తం 75 ప్రశ్నల్లో 15 నుంచి 20 ప్రశ్నలు సులభంగా, 25 నుంచి 30 ప్రశ్నలు మధ్యస్తంగాను, 25 నుంచి 30 ప్రశ్నలు కఠినంగాను ఉంటున్నాయి. కాబట్టి ప్రతి స్టూడెంట్​ కనీసం 50 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసే విధంగా సాధన చేస్తే మంచి ర్యాంక్​ సాధించే ఆస్కారం ఉంటుంది.

ఇంపార్టెంట్​ చాప్టర్స్​

మ్యాథమెటిక్స్​, ఫిజిక్స్​, కెమిస్ట్రీ మూడు సబ్జెక్టులకు సమాన ప్రాధాన్యత ఉంది కాబట్టి దేన్నీ నిర్లక్ష్యం చేయకూడదు.  ఇంపార్టెంట్​ చాప్టర్స్ ఎక్కువ సాధన చేస్తూనే మిగిలిన అధ్యాయాలను ప్రిపేరవ్వాలి. ​

మ్యాథమెటిక్స్​: క్వాడ్రటిక్​ ఈక్వేషన్స్​, మ్యాట్రిక్స్​ & డిటర్మినెంట్స్​, ప్రాబాబులిటీ & స్టాటిస్టిక్స్​, లిమిట్స్​ & కంటిన్యుటీ, డెఫినైట్​ ఇంటిగ్రేషన్​, డిఫరెన్షియల్​ ఈక్వేషన్స్​, త్రీడీ ప్లేన్స్​ & లైన్స్​, కోనిక్​ సెక్షన్​, డాట్​ ప్రాడక్ట్ & క్రాస్​ ప్రాడక్ట్​ ఆఫ్​ వెక్టర్స్​, బైనామియల్​ థీరమ్​ & సీక్వెన్స్​ అండ్​ సిరీస్​.

ఫిజిక్స్​: న్యూటన్​ లాస్​ ఆఫ్​ మోషన్స్​, మోడర్న్​ ఫిజిక్స్​, వేవ్స్​ & సౌండ్​, ఫ్లూయిడ్స్​, హీట్​ & థర్మోడైనమిక్స్​, గ్రావిటేషన్​, ఆప్టిక్స్​, స్టాటిక్​ & కరెంట్​ ఎలక్ట్రిసిటి,  సర్క్యులర్​ మోషన్​, ఎలాస్టిసిటి, విస్కోసిటీ & సర్​ఫేస్​ టెన్షన్​.

కెమిస్ట్రీ: అటామిక్​ స్ట్రక్చర్​, పీరియాడిక్​ టేబుల్​, కెమికల్​ బాండింగ్​, జనరల్​ ఆర్గానిక్​ కెమిస్ట్రీ, ఎలక్ట్రో కెమిస్ట్రీ, కెమికల్​ ఈక్విల్లీబ్రియం, థర్మోడైనమిక్స్, సాలిడ్​ స్టేట్​ & గ్యాసియస్​ స్టేట్​, డీ, ఎఫ్​ బ్లాక్​ ఎలిమెంట్స్​, బయోమాల్​క్యుల్స్​ & కెమిస్ట్రీ ఇన్​ ఎవ్రిడే లైఫ్​, హైడ్రోజన్​ & ఇట్స్​ కాంపౌండ్స్​.

కోటాగ్రాండ్ టెస్ట్స్

నీట్, జేఈఈ మెయిన్ ప్రాక్టీస్ కోసం ఎల్​హెచ్​ఎల్​  కంచన ఫౌండేషన్, ఐఐటీ- జేఈఈ/నీట్ ఫోరం వారు నామినల్​ ఫీజుతో ‘కోటా’ గ్రాండ్ టెస్ట్స్ అందుబాటులో ఉంచారు. గ్రాండ్‌‌ టెస్టులను వాట్సాప్  ద్వారా మొబైల్ వెర్షన్ పీడీఎఫ్​ కాపీలు కావాలనుకునేవారు ‘జేఈఈ 2021’ అని,  నీట్ వారు ‘నీట్ 2021’ అని టైప్ చేసి 98490 16661 నెంబర్ కు వాట్సాప్ చేయాలి. –లలిత్​కుమార్​, ఐఐటీ,నీట్​ ఫోరం

ప్రాక్టీస్పై ఫోకస్

  • రోజూ ప్రతి సబ్జెక్ట్​కు కనీసం 3 గంటల టైం కేటాయించి ప్రిపరేషన్​ సాగించాలి.
  • 2018,2019,2020 సంవత్సరాల ప్రీవియస్​ పేపర్స్​ రోజూ ఒకటి చొప్పున ప్రాక్టీస్​ చేయాలి.
  • ఇంపార్టెంట్ చాప్టర్స్​ డివైడ్​ చేసుకొని టైం టేబుల్​ ప్రిపేర్​ చేసుకోవాలి.
  • ప్రతి అధ్యాయంలో ముఖ్యమైన అంశాలను, ఫార్ములాలను తప్పనిసరిగా చదవాలి. ప్రాబ్లమ్స్​ సాధన చేయాలి.
  • సమయపాలన, వేగం, కచ్చితత్వం ఈ మూడు అంశాలపై బాగా పట్టు సాధించాలి. తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలను సాధించేలా సాధన చేయాలి.
  • న్యూమరికల్​ టైప్​ ఆన్సర్స్​ ప్రశ్నలను వీలైనన్ని ఎక్కువ సాధన చేయాలి. వీటిలో చాయిస్​ ఉంటుంది. నెగెటివ్​ మార్క్స్​ లేవు కాబట్టి మార్కులు తెచ్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
  • లాస్ట్​10 డేస్​లో ఎక్కువ గ్రాండ్​ టెస్ట్​లు చేయాలి. మాక్​ గ్రాండ్​ టెస్ట్​లను ఆన్​లైన్​లో ప్రాక్టీస్​ చేయడం మంచిది
  • ఎగ్జామ్ తేదీలు
    మొదటి విడత: ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు
    రెండో విడత: మార్చి 15 నుంచి 18 వరకు
    మూడో విడత: ఏప్రిల్ 27 నుంచి 30 వరకు
    నాలుగో విడత: మే 24 నుంచి 28 వరకు.