హనుమకొండ, వెలుగు: నేషనల్ టెస్టింగ్ఏజెన్సీ విడుదల చేసిన జేఈఈ మెయిన్స్ 2024 సెషన్ వన్ ఫలితాల్లో ఎస్ఆర్ విద్యా సంస్థల విద్యార్థులు విజయ ఢంకా మోగించారు. ఎస్ఆర్ విద్యా సంస్థలకు చెందిన దొంతుల మనీశ్ 300 మార్కులకుగానూ 295 మార్కులతో జాతీయ స్థాయిలో ప్రతిభ చాటారు. తుమ్మ తేజస్వీ 99.95శాతం, ఆర్.దీపాన్ష్ రెడ్డి 99.91శాతం, పి.నిహాల్ శ్రీవాత్సవ్ 99.91 శాతం మార్కులు సాధించారు.
కే.శ్రీరామ్ రెడ్డి, కే.సిద్ధార్థ రెడ్డి, వడ్లూరి ప్రతీక్, వి.సాయి ప్రణతి, ఉప్పల సూర్యతేజ, కేడీ.చెన్న కేశవ రెడ్డి, ఎం.శ్రీవళ్లి, మంచాల చంద్రదీప్, కె.సుబ్రహ్మణ్య ఆకాశ్, వల్లూరి వైశాలి 99 శాతానికిపైగా మార్కులు సాధించారు. తమ విద్యా సంస్థల పేరును విద్యార్థులు జాతీయ స్థాయిలో నిలబెట్టారని ఎస్ఆర్ విద్యాసంస్థల చైర్మన్ వరదారెడ్డి, డైరెక్టర్లు మధూకర్ రెడ్డి, సంతోష్ రెడ్డి తెలిపారు.