జల్సాల కోసం వరుస చోరీలు.. ఒకరు అరెస్ట్​

జల్సాల కోసం వరుస చోరీలు.. ఒకరు అరెస్ట్​
  • పరారీలో మరొకరు.. రూ.11.5 లక్షల సొత్తు స్వాధీనం

జీడిమెట్ల, వెలుగు: జల్సాలకు అలవాటు పడిన ఓ వ్యక్తి వరుస చోరీలు చేస్తూ పోలీసులకు చిక్కాడు. జీడిమెట్ల సీఐ మల్లేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. సూరారానికి చెందిన బేగరి వేణుకుమార్ ఈజీ మనీ కోసం చోరీలు చేస్తున్నాడు. గత నెల 6న  రాత్రి అపురూపకాలనీలోని ఓ ఇంట్లోకి చొరబడి రూ.10 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లాడు. బాధితుల  ఫిర్యాదుతో పోలీసులు గాజులరామారంలో వేణుకుమార్ ను పట్టుకున్నారు.

 విచారణలో ఇటీవల జీడిమెట్ల, బాచుపల్లి, ఘట్​కేసర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలు చేసినట్లు ఒప్పకున్నాడు. వేణుకుమార్​వద్ద నుంచి ద్విచక్రవాహనంతోపాటు ఆభరణాలు, రూ.50 వేలు కలిపి మొత్తం రూ.11.5 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు సంపత్ సాయి పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు. వేణుకుమార్​పై పోక్సో, ఎన్​డీపీఎస్​ కేసులతో కలిపి 44 కేసులున్నట్లు పేర్కొన్నారు. గతంలో పలుమార్లు జైలుకు పంపడంతోపాటు దుండిగల్​పోలీస్ స్టేషన్​ పరిధిలో పీడీ యాక్ట్​ సైతం నమోదు చేసినట్లు చెప్పారు.