
వెలుగు, జీడిమెట్ల : మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీసు స్టేషన్‌లో చిన్న పిల్లల కోసం ప్లే జోన్, బేబీ ఫీడింగ్రూమ్ను ఏర్పాటు చేశారు. డీసీపీ సురేశ్‌కుమార్, ఏసీపీ హనుమంతు, స్టేషన్ సీఐ గడ్డం మల్లేశ్‌తో కలిసి సైబరాబార్ అవినాశ్మహంతి శుక్రవారం ప్రారంభించారు. పీఎస్‌కు వచ్చే విజిటర్ల పిల్లలు ఇబ్బందులు పడకుండా మంచి వాతావరణం ఏర్పాటుకు కృషిచేస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి జోన్ లు మరిన్ని స్టేషన్లకు విస్తరిస్తామని తెలిపారు. –