Netflix Crime Thriller: అదిరిపోయే ట్విస్టులతో నెట్‌ఫ్లిక్స్ మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్

Netflix Crime Thriller: అదిరిపోయే ట్విస్టులతో నెట్‌ఫ్లిక్స్ మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్

2025 ఏడాది షురూ అవుతుండటంతోనే నెట్‌ఫ్లిక్స్ (Netflix) అదిరిపోయే సినిమాలను అనౌన్స్ చేసింది తెలిసిందే. అందులో తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో సినిమాలు రాబోతున్నట్లు క్యూరియాసిటీ పెంచేసింది.

ఈ క్రమంలో నెట్‌ఫ్లిక్స్ వారానికో సినిమా. అందులోను.. ముఖ్యంగా క్రైమ్, థ్రిల్లర్ సిరీస్లు ఉండేలా ప్లాన్ చేస్తూ వెళ్తుంది. బాలీవుడ్ నుంచి లాస్ట్ వీక్లో 'డబ్బా కార్టెల్' ప్రీమియర్కి రాగా.. ఈ వారం మరో ఇంట్రెస్టింగ్ సిరీస్ రాబోతున్నట్లు అప్డేట్ ఇచ్చింది. అదే 'ఖాకీ: ది బెంగాల్ చాప్టర్'(Khakee The Bengal Chapter).

ఖాకీ: ది బెంగాల్ చాప్టర్ ఓటీటీ:

బేబీ, అయ్యారీ, స్పెషల్ 26, ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ మరియు సికందర్ కా ముఖద్దర్ సినిమాలను డైరెక్ట్ చేసిన నీరజ్ పాండే ఈ సిరీస్కు షో రన్నర్గా వ్యవహరించాడు. దేబాత్మ మండల్ డైరెక్ట్ చేశాడు. మొదట నవంబర్, 2022లో ఫస్ట్ సీజన్ వచ్చింది. తర్వాత ఆగస్ట్ 2023లో రెండో సీజన్ను కూడా తీసుకొచ్చారు. ఇప్పుడిది షో ఖాకీ: ది బీహార్ చాప్టర్‌కు కొనసాగింపుగా రాబోతుంది.

లేటెస్ట్గా నేడు (మార్చి 3న) నెట్‌ఫ్లిక్స్ 'ఖాకీ: ది బెంగాల్ చాప్టర్' సిరీస్ స్ట్రీమింగ్ వివరాలు వెల్లడించింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మార్చి 20 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. 

“ఖూన్ యా కానూన్ (రక్తం లేదా చట్టం).. గెలుపు దేనిది? ఖాకీ: ది బెంగాల్ ఛాప్టర్ త్వరలోనే నెట్‌ఫ్లిక్స్ లోకి రాబోతోంది” అంటూ సదరు ఓటీటీ సంస్థ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇచ్చింది. ఈ క్రైమ్ డ్రామాలో జీత్, ప్రోసెన్‌జిత్ ఛటర్జీ, శాశ్వత మరియు పరంబ్రత ఛటర్జీ తదితరులు నటించారు.

ఖాకీ: ది బెంగాల్ చాప్టర్ కథ:

ఈ సిరీస్ 2000ల ప్రారంభంలో బెంగాల్ నేపథ్యంలో సాగుతుంది. పవర్ కోసం (అధికార దాహం) ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే గ్యాంగ్‌స్టర్లు, రాజకీయ నాయకులు ఓవైపు, అలాగే చట్టం అమలు చేయుటకు, శాంతిని కాపాడుకోవడానికి అధికారులు కష్టం మరోవైపు.

ALSO READ | The Raw Statement: నేచురల్ స్టార్ నానీ సినిమాలో పచ్చి బూతు డైలాగ్స్ : పచ్చబొట్టులోనూ బోల్డ్ స్టేట్ మెంట్స్

ఇందులో భాగంగా ఐపీఎస్ ఆఫీసర్ అర్జున్ మైత్రాకు.. గ్యాంగ్‌స్టర్లు, రాజకీయ నాయకులకు మధ్య జరిగే సంఘర్షణే ఈ ఖాకీ: ది బెంగాల్ ఛాప్టర్ వెబ్ సిరీస్ కథ. ఇటువంటి వ్యవస్థలు నగరాన్ని పీడిస్తున్న హింసను ఐపీఎస్ మైత్రా ఎలా అరికట్టాడనేది మెయిన్ స్టోరీ.