మిడ్ డే మీల్స్ వర్కర్స్​ సమస్యలు పరిష్కరించాలి : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల టౌన్, వెలుగు: మిడ్ డే మీల్స్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్ బకాయిలు విడుదలతోపాటు పెంచిన వేతనాలు అమలుచేయాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మిడ్ డే మీల్స్ కార్మికులు సోమవారం ర్యాలీగా తరలివచ్చి కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. 

వారికి జీవన్ రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మిడ్ డే మీల్స్​ కార్మికులకు వేతనాలు పెంచుతామని సీఎం కేసీఆర్​అసెంబ్లీ వేదికగా ప్రకటించి 18నెలలు గడుస్తున్నా అమలు చేయకపోవడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రాములు, హనుమంతు, మహేశ్‌‌‌‌‌‌‌‌, కార్మికులు పాల్గొన్నారు.