సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ వేగవంతం చేసి ఖాళీలను భర్తీ చేస్తమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర టీచర్ ఫెరిడ్రేషన్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 2024 క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.
తెలంగాణ ఉద్యమంలో ఉపాధ్యాయులు కీలకపాత్ర పోషించారని జీవన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం అవుతాయని భావిస్తే మరిన్ని పెరిగిపోయాయని ఫైర్ అయ్యారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బోధన సిబ్బందిని ఉంచాల్సిన అవసరం ప్రభుత్వం పై ఉందని జీవన్ రెడ్డి అన్నారు. ఆంగ్ల మార్గంలో ఉచిత నిర్బంధ విద్య కేవలం ప్రకటనలకే పరిమితమైందని చెప్పారు. పాఠశాలల్లో విద్యార్థులు లేరని క్రమబద్ధీకరణ నెపంతో ఉపాధ్యాయుల సంఖ్యను కుదించారని జీవన్ రెడ్డి అన్నారు.