బీఆర్ఎస్​ ఒక మునిగిపోయే నావ: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల టౌన్, వెలుగు: ఏ సిద్దాంతం లేని పార్టీ ఉందంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీ నే అని, అది మునిగిపోయే నావ అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక ఇంద్రభవన్ లో ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ రాజకీయంగా విభేదాలు ఉండడం సహజమే కానీ దేశ ప్రధానమంత్రి రాష్ట్రానికి వస్తే సీఎం కేసీఆర్ కు ప్రోటోకాల్ పాటించడం తెలియదా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీలు మొన్నటిదాకా దాగుడు మూతలు ఆడాయని, ఇప్పుడు ఒక్కొక్కటిగా వారి ఆటలన్నీ తేటతెల్లం అవుతున్నాయని చెప్పారు.

ALSOREAD:మద్యం తాగించి హత్యాయత్నం...తప్పించుకుని హాస్పిటల్​కు చేరిన యువకుడు

వారి రాజకీయం గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ అన్నట్లుగా మారిందని ఎద్దేవా చేశారు. ముదిరాజ్ లపైఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఇంత వివాదం జరుగుతున్నా బీఆర్​ఎస్​పార్టీలో చలనం లేకపోవడం సిగ్గుచేటన్నారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను తన సొంత పార్టీ ఎమ్మెల్యే జోగు రామన్న ఖండించడం హర్షనీయమన్నారు.ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు గిరి నాగభూషణం, కార్యదర్శి  బండ శంకర్, కల్లేపల్లి దుర్గయ్య, గుండా మధుపాల్గొన్నారు.