ఐటీ ట్యాక్స్ కట్టేవారికి రైతుబంధు ఎందుకు: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

రైతుబంధుపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక వాఖ్యలు చేశారు. ఐటీ ట్యాక్స్ కట్టే వారికి.. వందలవేల ఎకరాలున్నవారికి రైతుబంధు ఇవ్వడం అసమంజసమని తెలిపారు. ఇకపై కేవలం సాగు చేసే వారికే ప్రభుత్వం రైతుబంధు ఇవ్వనుందని వెల్లడించారు. నిజమైన రైతులకు మాత్రమే పెట్టుబడి సాయం చేయాలన్నారు. రైతు భరోసాకు సంబంధించి విధివిధానాలపై కూడా పరిశీలన జరుగుతుందని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.

నిజమైన రైతులకు పెట్టుబడి సహాయం చేయాలే కానీ.. వందల వేల ఎకరాలున్న వారు రైతులు ఎలా అవుతారని నిలదీశారు. జగిత్యాల జిల్లా బీర్పూర్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫిల్టర్ బెడ్ పరిశీలించారు.