ఆర్మూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశా: జీవన్ రెడ్డి

ఆర్మూర్, వెలుగు: పదేళ్లలో ఆర్మూర్ నియో జకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేశానని  ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి ఆశన్న గారి జీవన్ రెడ్డి అన్నారు. శుక్రవారం రాత్రి ఆర్మూర్  మండలం చేపూర్ గ్రామంలో ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా ప్రచారం  నిర్వహించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ అన్నివర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందించిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందన్నారు.  ఆశీర్వదించి మళ్లీ గెలిపిస్తే  మూడోసారి ఎమ్మెల్యే అవుతానానని పేర్కొన్నారు. ఆయన వెంట సర్పంచ్ ఇందూర్ సాయన్న,  నాయకులు రాజేశ్వర్, జన్నెపల్లి గంగాధర్​ తదితరులు పాల్గొన్నారు.