బీజేపీ ప్రతిష్ట రోజురోజుకు దిగజారుతోంది : జీవన్ రెడ్డి

దేశంలో బీజేపీ ప్రతిష్ట రోజురోజుకు దిగజారిపోతుందన్నారు నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి.  సమాజాన్ని చీల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందన్నారు.  భగవద్గీత లాంటి రాజ్యాంగాన్ని బీజేపీ మారుస్తాననడం హస్యాస్పదమన్నారు. 

మోడీకి ఆదాని, అంబానీ అండ ఉందని..మరి రాహుల్ గాంధీకి ఎవరున్నారని ప్రశ్నించారు జీవన్ రెడ్డి.  కాంగ్రెస్ పార్టీ దేశ సమగ్రతను కాపాడిందన్నారు.  దేశ సమగ్రత కోసం ఇందిరాగాంధీ  ప్రాణత్యాగం చేశారని చెప్పారు.  రైతులకు మద్దతు ధర కల్పించాలని కోరితే హిందూ వ్యతిరేకమంటూ ముద్ర వేస్తున్నారని విమర్శించారు.

నిజామాబాద్ పార్లమెంట్ లో జగిత్యాల నియోజకవర్గం, అంతర్భాగమని..అందుకే నిజామాబాద్ ఎంచుకున్నానని చెప్పారు.  నిజామాబాద్ పార్లమెంట్ అయితే జగిత్యాల అభివృద్ధి చేసుకునే చాన్స్  ఉంటుందన్నారు. ఎంపీగా గెలిచిన వెంటనే అభివృద్ధి పథంలో ముందుకు సాగుతానని చెప్పారు.