రైతులకు అండగా నిలిచేది కాంగ్రెస్సే: జీవన్ రెడ్డి

రాయికల్, వెలుగు: ఆనాడైనా, ఈనాడైనా రైతులకు అండగా నిలిచేది కాంగ్రెస్ పార్టీయేనని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.  మండలంలోని ఇటిక్యాలలో  ఇంటింటా ప్రచారం నిర్వహించారు. అనంతరం సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ, ఓడినా గెలిచినా తన జీవితాన్ని ప్రజా సేవకే అంకితం చేశా నన్నారు. కాళేశ్వరం పిల్లర్లు కుంగిపోయాయని, ఇదేనా కేసీఆర్ మేథోమథనమని నిలదీశారు.

కాంగ్రెస్ ఆధికారంలో ఉండగా చేపట్టిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, శ్రీశైలం ప్రాజెక్ట్, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నేటికీ చెక్కు చెదరలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే  ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు.  అనంతరం మాజీ సర్పంచ్ కుంట గంగా రెడ్డితోపాటు మరో 50 మంది మహిళలు, యువకులు కాంగ్రెస్ లో చేరారు.