నందిపేట, వెలుగు: ఆర్మూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, వచ్చే ఎన్నికల్లోనూ మళ్లీ ఆశీర్వదించాలని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కోరారు. ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా శుక్రవారం డొంకేశ్వర్ మండలంలోని మారంపల్లిలో ఆయన సతీమణి రజితరెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన రోడ్‌షో లో జీవన్‌రెడ్డి మాట్లాడుతూ మీ ఊరి అల్లున్ని.. మరోసారి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానన్నారు. ఓట్ల కోసం బీజేపీ, కాంగ్రెస్ చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని, వారి మాటలు నమ్మొద్దన్నారు. అనంతరం నందిపేటకు వచ్చిన ఆయన దివ్యాంగులతో నిర్వహించిన కృతజ్ఞత సమావేశంలో పాల్గొన్నారు.