పద్మారావునగర్, వెలుగు: బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల ఆర్గాన్స్డొనేట్చేస్తే మరికొందరికి పునర్జన్మ కల్పించవచ్చని జీవన్‌దాన్ చైర్ పర్సన్ డీఎంఈ డాక్టర్ ఎన్.వాణి చెప్పారు. శుక్రవారం నేషనల్ ఆర్గాన్స్ డోనర్స్ డే సందర్భంగా గాంధీ మెడికల్ కాలేజీలో రాష్ట్రంలోని ఆర్గాన్ డోనర్ల కుటుంబ సభ్యులను సన్మానించి, ప్రశంసాపత్రాలను అందజేశారు. బ్రెయిన్‌డెడ్ అయిన వారి కుటుంబ సభ్యుల సామాజిక బాధ్యతను అందరూ అభినందించాలని వాణి అన్నారు.
జీవన్ దాన్ కో చైర్మన్ బీరప్ప, రాష్ట్ర కోఆర్డినేటర్ స్వర్ణలత, గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ఇందిర, గాంధీ సూపరింటెండెంట్ సి.హెచ్.ఎన్.రాజకుమారి, డా.మంజూష పాల్గొన్నారు.