కార్పొరేట్ సేవలో జీవన్‌‌‌‌‌‌‌‌దాన్‌‌‌‌‌‌‌‌

కార్పొరేట్ సేవలో జీవన్‌‌‌‌‌‌‌‌దాన్‌‌‌‌‌‌‌‌
  • ప్రైవేట్ ​హాస్పిటళ్లకు అనుకూలంగా నిబంధనలు
  • -గడిచిన పదేండ్లలో ప్రైవేటులోనే 98 శాతం బ్రెయిన్ డెత్స్‌‌‌‌‌‌‌‌
  • 1,424 బ్రెయిన్ డెత్స్‌‌‌‌‌‌‌‌తో 5,060 ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ప్లాంటేషన్స్ 
  • అవయవ మార్పిడితో కోట్లు గడిస్తున్న ప్రైవేట్​ దవాఖానలు​
  • సర్కారు ఆసుపత్రుల్లో నిర్లక్ష్యం.. 2 శాతానికే పరిమితం
  • పదేండ్లలో ఒక్కటే బ్రెయిన్ డెత్ గుర్తించిన గాంధీ
  • 32తో సరిపెట్టిన నిమ్స్‌‌‌‌‌‌‌‌..సింగిల్ డిజిట్‌‌‌‌‌‌‌‌ వద్దే ఉస్మానియా 
  • కారణాలు వెతికి ప్రభుత్వానికి నివేదించని జీవన్‌‌‌‌‌‌‌‌దాన్ 
  • అవయవాలకు నోచుకోని సామాన్యులు

హైదరాబాద్, వెలుగు : పేద, గొప్ప అనే తేడా లేకుండా అవయవాలు అవసరమైనవారికి ప్రాధాన్యత క్రమంలో అందించే లక్ష్యంతో ఏర్పాటుచేసిన జీవన్‌‌‌‌‌‌‌‌దాన్.. కార్పొరేట్​ఆసుపత్రుల సేవలో తరిస్తున్నది. జీవన్​దాన్​ పేరు మీద ప్రభుత్వం ఏటా కోట్లు ఖర్చు చేస్తున్నా.. ఆశించిన ప్రయోజనం నెరవేరడం లేదు. ఈ కార్యక్రమం మొదలై దశాబ్దం దాటిపోయినా.. సర్కారు దవాఖానల్లో బ్రెయిన్​డెత్స్​ గుర్తింపుగానీ, సామాన్యులకు అవయవాలుగానీ అందడం లేదు. అదే సమయంలో ఈ జీవన్‌‌‌‌‌‌‌‌దాన్​లోని నిబంధనలు తమకు అనుకూలంగా మార్చుకున్న కార్పొరేట్ దవాఖాన్లు..

 ఆ పేరుతో కోట్లు గడిస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జీవన్‌‌‌‌‌‌‌‌దాన్ అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ఉమ్మడి రాష్ట్రంలో నిర్ణయం తీసుకోగా, 2013 నుంచి అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 1,466 బ్రెయిన్ డెత్స్ జరిగితే.. అందులో 1,424 మరణాలను కార్పొరేట్ దవాఖాన్లే డిక్లేర్ చేశాయి.సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు, సకల సౌకర్యాలు ఉన్న నిమ్స్ హాస్పిటల్ 32 బ్రెయిన్ డెత్స్‌‌‌‌‌‌‌‌ను మాత్రమే గుర్తించగలిగింది. 

Also Read:-త్వరలో డ్రైవర్​లెస్​ వెహికల్​అభివృద్ధి చేస్తున్న ఐఐటీ హైదరాబాద్

పైగా జీవన్‌‌‌‌‌‌‌‌దాన్ వ్యవస్థకు ఈ దవాఖానే నోడల్ సంస్థగా ఉండడం గమనార్హం. ఇక్కడ పనిచేస్తున్న డాక్టరే జీవన్‌‌‌‌‌‌‌‌దాన్‌‌‌‌‌‌‌‌కు ఇన్​చార్జిగా ఉన్నారు. రాష్ట్రంలో అతి పెద్ద ప్రభుత్వ దవాఖాన్లుగా పేరుగాంచిన గాంధీలో పదేండ్లలో ఒకే ఒక్క బ్రెయిన్ డెత్, ఉస్మానియాలో 9 మాత్రమే డిక్లేర్ చేశారు.

ఎందుకిలా..?

కార్పొరేట్ హాస్పిటళ్లతో పోలిస్తే ఉస్మానియా, గాంధీ, నిమ్స్‌‌‌‌‌‌‌‌కు పదుల రెట్లు అధికంగా ఎమర్జెన్సీ, బ్రెయిన్ ఇంజూర్ కేసులు వస్తాయి. వందల సంఖ్యలో కేసులు వచ్చే యశోద, అపోలో, కిమ్స్ వంటి హాస్పిటళ్లు పదుల సంఖ్యలో బ్రెయిన్ డెత్స్ గుర్తిస్తుంటే.. వేల సంఖ్యలో ఎమర్జెన్సీ కేసులు వచ్చే నిమ్స్, గాంధీ, ఉస్మానియాలో మాత్రం ఏటా కనీసం డబుల్ డిజిట్ బ్రెయిన్‌‌‌‌‌‌‌‌ డెత్స్‌‌‌‌‌‌‌‌ కూడా గుర్తించడం లేదు. కార్పొరేట్ హాస్పిటళ్ల కంటే ఎక్కువ మంది న్యూరో సర్జన్లు, ఇతర స్పెషలిస్టు డాక్టర్లు ఈ 3 దవాఖాన్లలో ఉన్నారు. బ్రెయిన్‌‌‌‌‌‌‌‌ డెత్స్‌‌‌‌‌‌‌‌పై వీరికి పూర్తిస్థాయిలో అవగాహన ఉంది.  కానీ బ్రెయిన్ డెత్స్ ను గుర్తించడంలో ఈ హాస్పిటళ్లు పూర్తిగా విఫలమవుతున్నాయి.

 ఇందుకు కారణాలు వెతికి, ప్రభుత్వానికి నివేదించాల్సిన జీవన్‌‌‌‌‌‌‌‌దాన్ వ్యవస్థ ఆ పని చేయడం లేదు. పెద్ద దవాఖాన్ల పరిస్థితి ఇలా ఉంటే, జిల్లాల్లో ఉన్న టీచింగ్ హాస్పిటళ్లు, జిల్లా హాస్పిటళ్ల పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. 

గడిచిన దశాబ్ద కాలంలో కనీసం ఒక్క బ్రెయిన్ డెత్‌‌‌‌‌‌‌‌ కేసును కూడా జిల్లాల్లోని ప్రభుత్వ హాస్పిటళ్లు గుర్తించలేదు. అసలు అక్కడ పనిచేసే డాక్టర్లకు బ్రెయిన్ డెత్స్‌‌‌‌‌‌‌‌ గుర్తించడంలో అవగాహన కల్పించడం, బ్రెయిన్ డెత్స్‌‌‌‌‌‌‌‌కు ఉన్న ప్రాధాన్యతను తెలియజెప్పడంలో జీవన్‌‌‌‌‌‌‌‌దాన్ వ్యవస్థ విఫలమైంది. జిల్లాల్లోని ప్రైవేటు హాస్పిటళ్లు మాత్రం బ్రెయిన్ డెత్ కేసులను గుర్తించి, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని కార్పొరేట్ హాస్పిటళ్లకు రిఫర్ చేసి, కమీషన్లు పొందుతున్నాయి. తద్వారా కార్పొరేట్ హాస్పిటళ్లకు కూడా కోట్లలో లబ్ధి చేకూరుతున్నది. 

ప్రైవేట్​లో 5,060 ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ప్లాంటేషన్లు

గడిచిన 11 ఏండ్లలో జీవన్‌‌‌‌‌‌‌‌దాన్ ద్వారా 1,466 బ్రెయిన్ డెత్‌‌‌‌‌‌‌‌ శరీరాల నుంచి 5,619 ఆర్గాన్స్ సేకరించారు. ఇందులో 5,060 ఆర్గాన్స్ ప్రైవేటు హాస్పిటళ్లకే వెళ్లాయి. వేర్వేరు కార్పొరేట్ హాస్పిటళ్లు ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ప్లాంటేషన్ సర్జరీలు చేసి, అవయవాలను తమ పేషెంట్లకు అమర్చి కోట్లు గడించాయి. ప్రభుత్వ దవాఖాన్లలో కేవలం 559 అవయవ మార్పిడి సర్జరీలు జరిగాయి. ప్రభుత్వ దవాఖాన్లు ఇలా వెనుకబడిపోవడానికి బ్రెయిన్ డెత్స్‌‌‌‌‌‌‌‌ను గుర్తించడంలో జరుగుతున్న నిర్లక్ష్యం ఓ కారణమైతే, జీవన్‌‌‌‌‌‌‌‌దాన్‌‌‌‌‌‌‌‌ నిబంధనల్లో ఉన్న లొసుగులు మరో కారణమని డాక్టర్లు చెబుతున్నారు. 

జీవన్‌‌‌‌‌‌‌‌దాన్ నిబంధనల ప్రకారం ఏ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో బ్రెయిన్ డెత్‌‌‌‌‌‌‌‌ను గుర్తిస్తే, ఆ వ్యక్తి కిడ్నీ, గుండె, లివర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తీసుకుని తమ పేషెంట్లకు అమర్చుకునే అధికారం కూడా ఆ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కే దక్కుతుంది. ఇలా జీవన్‌‌‌‌‌‌‌‌దాన్‌‌‌‌‌‌‌‌ను ఓ దందాగా కార్పొరేట్ హాస్పిటళ్లు మార్చేశాయి. జిల్లాల్లోని ప్రభుత్వ హాస్పిటళ్లు, మెడికల్ కాలేజీల్లో పనిచేస్తున్న డాక్టర్లకు బ్రెయిన్ డెత్ కేసుల గుర్తింపుపై ట్రైనింగ్, అవసరమైన సౌకర్యాలు కల్పించడంపై జీవన్‌‌‌‌‌‌‌‌దాన్ దృష్టి పెట్టడం లేదు. ప్రభుత్వానికి కనీసం సూచనలు కూడా చేయడం లేదని డాక్టర్లు ఆరోపిస్తున్నారు.

ఆరోగ్యశ్రీలో అవకాశం ఉన్నా అవయవాలు అందట్లే

రాష్ట్రంలో వేల మంది కిడ్నీ, గుండె, లివర్ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. ఆయా అవయవాలు దెబ్బతిని, అవయవదాతల కోసం ఎదురుచూస్తున్నారు. కార్పొరేట్ దవాఖాన్లలో అవయవ మార్పిడి సర్జరీలు చాలా ఖర్చుతో కూడుకుని ఉండడంతో ప్రభుత్వమే ఆరోగ్యశ్రీ కిందకు ఈ సర్జరీలను తీసుకొచ్చింది. రూ.10 లక్షల ప్యాకేజీతో ఆర్గాన్‌‌‌‌‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ప్లాంటేషన్‌‌‌‌‌‌‌‌ను ఆరోగ్యశ్రీ కింద చేర్చింది. 

ఎంతో మంది పేద రోగులకు ఇది ఉపయోగపడేలా ఉన్నప్పటికీ, ఆర్గాన్ డోనర్లు దొరక్కపోవడం వారికి శాపంగా మారుతున్నది. ఆర్గాన్ కోసం ఎదురుచూస్తూనే ఏటా వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందులో చిన్న పిల్లలు, యువతీ,యువకులు కూడా ఉంటున్నారు. ప్రస్తుతం కిడ్నీ కోసం 2,467 మంది, లివర్ కోసం 982 మంది, గుండె కోసం 88, లంగ్స్ కోసం 81, పాంక్రియాజ్ కోసం 15 మంది జీవన్​దాన్​లో రిజిస్ట్రేషన్​ చేసుకొని ,అవయవాల కోసం ఎదురు చూస్తున్నారు.

నత్తనడకన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్

ఆర్గాన్స్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ప్లాంటేషన్ కోసం గాంధీ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పేరిట ఓ పెద్ద సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేస్తున్నట్టు సుమారు ఐదేండ్ల కింద అప్పటి బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 8 ఆపరేషన్ థియేటర్లతో అన్ని రకాల అవయవ మార్పిడి సర్జరీలు చేసేలా సౌకర్యాలు కల్పిస్తామని ప్రకటించింది. పనులు కూడా ప్రారంభమయ్యాయి. కానీ, ఇప్పటికీ పూర్తి కాలేదు. ఆ పనులను ఉన్నతాధికారులు పర్యవేక్షించకపోవడం, ప్రభుత్వ పెద్దలు పట్టించుకోకపోవడంతో నత్తనడకన సాగుతున్నాయి.

వివిధ అవయవాల కోసం ఎదురుచూస్తున్న వాళ్లు

కిడ్నీ                    2,467  

లివర్                    982  

గుండె                   88

లంగ్స్                  81  

పాంక్రియాజ్      15

2013 తర్వాత బ్రెయిన్ డెత్స్..

డిక్లేర్​ చేసిన ఆసుపత్రులు    బ్రెయిన్​డెత్స్

కార్పొరేట్                                  1,424

నిమ్స్                                           32

ఉస్మానియా                                09

గాంధీ                                           01

మొత్తం                                     1,466