మళ్లీ బీఆర్ఎస్ను గెలిపిస్తే మిగిలేవి కన్నీళ్లే: జీవితా రాజశేఖర్

బీఆర్ఎస్ ను గెలిపిస్తే కన్నీరు మిగిలిందే తప్ప పనులు మాత్రం జరగలేదని బీజేపీ నేత జీవిత రాజశేఖర్ ఆరోపించారు. సిద్దిపేట పట్టణంలోని నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న ఆమె జనం బ్రతకడానికి బీజేపిని గెలిపించాలని పిలుపునిచ్చారు. అందరూ 6359119119 నెంబర్ కు మిస్ కాల్డ్ ఇచ్చి బీజేపీకి మద్దతు ప్రకటించాలని కోరారు. సిద్దిపేటలో జరుగుతున్న అరాచకాలు చూస్తుంటే సినిమా విలన్లు కూడా సరిపోరని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మిషన్ భగీరథ పథకంలో భారీగా అవినీతిని జరిగిందని జీవిత ఆరోపించారు.

రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చుతానన్న కేసీఆర్ తన కుటుంబాన్ని మాత్రమే బంగారమయం చేసుకున్నారని జీవిత విమర్శించారు. సిద్దిపేటలో డబుల్ బెడ్ రూం ఇండ్లు హరీష్ రావు అనుచరులకు మాత్రమే ఇచ్చారని ఆరోపించారు. ధరణిలో లోపాల కారణంగా రైతులకు అన్యాయం జరుగుతోందన్నారు. కొనొకార్పస్ చెట్ల వల్ల ప్రజలకు అనారోగ్యం పాలైతే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ప్రధాని మోడీ దేశాన్ని అగ్రరాజ్యాంగా తీర్చిదిద్దుతున్నారని.. అందుకే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇవ్వాలని జీవిత కోరారు.