కౌశిక్ రెడ్డి మా మరిది విషయంలో నానా బీభత్సం చేసిండు: జీవిత

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఓ పెద్ద రౌడీ అంటూ బీజేపీ నాయకురాలు జీవిత రాజశేఖర్ విమర్శించారు.  జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో జరిగిన ప్రజా గోస బీజేపీ భరోసా కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తన  సొంత మరిది విషయంలో కౌశిక్ రెడ్డి  నానా బీభత్సం చేశారని జీవిత ఆరోపించారు. కౌశిక్ రెడ్డి కేసీఆర్ ప్రతీ మీటింగ్ కు టోపి పెడ్తాడని.. ఆ టోపి ప్రజలకు పెట్టేందుకనే విషయాన్ని గ్రహించాలన్నారు.

మాస్టర్ ప్లాన్ ముసుగులో  గ్రామాలను మున్సిపాలిటీల్లో కలిపి  కబ్జా చేస్తున్నారని జీవిత రాజశేఖర్ ఆరోపించారు. తెలంగాణకు భారీగా ఆదాయం వస్తుందని గొప్పలు చెబుతున్నారు కానీ.. ఆ ఆదాయం  ప్రజలను మద్యం మత్తులో ముంచితేనే  వచ్చిందన్న విషయాన్ని గ్రహించాలన్నారు. బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ఆమె కోరారు.