దాడి జరిగిన రోజు సైఫ్ అలీఖాన్ ఇంట్లో జరిగింది ఇదే.. డబ్బు కోసమే అలా..

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ ఇంట్లో జరిగిన దాడిలో ఆయన తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ముంబై పోలీసులు సైఫ్ ఇంట్లో పని చేస్తున్నవారిని విచారిస్తున్నారు. ఇందులోభాగంగా సైఫ్ ఇంట్లోని పని చేసే వ్యక్తులలో ఒకరైన ఎలియామా ఫిలిప్ ని పోలీసులు విచారించారు.

ఈ విచారణలో ఎలియామా మొదటగా గురువారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో సైఫ్ ఇంట్లోని ఓ గోడ వైపు మరో కేర్ టేకర్ అయిన జుహ్ ని గోడకి అదిమిపట్టి నోరు మూస్తూ ఉండటంతో దొంగ నీడని గురించానని తెలిపింది. కానీ మోదట్లో ఆ నీడ కరీనా కపూర్ ది అనుకుని వెళ్లబోతుండగా అతడి టోపీ కనిపించిందని దాంతో వెంటనే అతడి వద్దకు వెళ్లి ఎమ్ జారుతుందో తెలుసుకునే ప్రయత్నం చేసానని పోలీసుల విచారణలో తెలిపింది. 

ALSO READ | డ్రెస్ మార్చీ తిరుగుతున్న దొంగ.. సైఫ్ అలీఖాన్ కేసులో నిందితుడి మరో ఫోటో రిలీజ్

అయితే దగ్గరికి వెళ్లి చూసినప్పుడు జుహ్ పై కత్తి పెట్టి కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తుండగా విన్నానని దీంతో ఆమెని రక్షించే క్రమంలో తన చేతికి గాయాలయ్యని పేర్కొంది. దొంగతో ఎలియామా ఫిలిప్ తలపడుతున్న సమయంలో జుహ్ అక్కడినుంచి తప్పించుకుని సైఫ్ కుటుంబ సభ్యులని అప్రమత్తం చేసేందుకు ప్రయత్నాలు చేసినట్లు వెల్లడించింది.

ఇక దాడి సమయంలో సైఫ్ అలీఖాన్‌కు పలు గాయాలు అయ్యాయని ఎలియామా అధికారులకు తెలియజేశారు. వీటిలో సైఫ్ మెడ వెనుక, కుడి భుజం దగ్గర,  వెనుక ఎడమ వైపు, ఎడమ మణికట్టు మరియు మోచేయిపై గాయాలు అయ్యాయని దాంతో ఇబ్రహీం అలీ ఖాన్ వెంటనే సైఫ్ అలీ ఖాన్ ని లీలావతి హాస్పిటల్ కి తరలించాడని ఎలియామా విచారణలో వెల్లడించారు.