సంతోషంగా వస్తా....మోదీఆహ్వానంపై జెలెన్ స్కీ స్పందన

సంతోషంగా వస్తా....మోదీఆహ్వానంపై జెలెన్ స్కీ స్పందన
  • ఇండియా రావాలన్న మోదీఆహ్వానంపై జెలెన్ స్కీ స్పందన

న్యూఢిల్లీ: ఇండియాకు రావాలని ఉక్రెయిన్  ప్రెసిడెంట్  వోలోదిమిర్  జెలెన్ స్కీని ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానించారు. శుక్రవారం ఉక్రెయిన్ లో పర్యటించిన మోదీ.. శనివారం భారత్ కు తిరిగి వచ్చారు. ఉక్రెయిన్  రాజధాని కీవ్ లో జెలెన్ స్కీతో మోదీ వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఇండియాకు రావాలని జెలెన్ స్కీని ఆయన ఆహ్వానించారు. ఈ విషయంపై జెలెన్  స్కీ స్పందిస్తూ.. సంతోషంగా భారత్ లో పర్యటిస్తానని మీడియా సమావేశంలో ప్రకటించారు. ‘‘సాధ్యమైనంత త్వరగా భారత్ లో పర్యటించాలనుకుంటున్నా. ఈ విషయంలో ఏమాత్రం సమయం వృధా చేయాలనుకోవడం లేదు. ఇండియా చాలా గొప్ప దేశం. పెద్ద దేశం. మా దేశానికి ఇండియా ఎంతో అవసరం. ఇండియా ప్రభుత్వం నన్ను చూసేందుకు సిద్ధం కాగానే.. నేను ఇండియాలో పర్యటిస్తా” అని జెలెన్  స్కీ పేర్కొన్నారు.