
హైదరాబాద్, వెలుగు: కరెన్సీ నోట్లపై బీఆర్ అంబేద్కర్ ఫొటోను ముద్రించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 26న ఢిల్లీలో వందల మంది కళాకారులచే ‘‘ధూం ధాం’’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు అంబేద్కర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు జేరిపోతుల పరశురాం తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని ఆయన కోరారు. ఈ మేరకు సోమవారం అసెంబ్లీలో వివేక్‌ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. న్యాయమైన డిమాండ్ లక్ష్య సాధనలో కలసి పనిచేస్తామని, ఢిల్లీలో జరిగే కార్యక్రమానికి హాజరవుతానని తెలిపారు.