నవంబర్ 19.. 2023 ఈ తేదీ భారత క్రికెట్ జట్టుతో పాటు టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ కు పీడకల. ఫామ్ లో ఉన్న మన ఆటగాళ్లు సొంత గడ్డపై ఈ సారి కప్ కొట్టడం గ్యారంటీ అనుకున్న ఫ్యాన్స్ కు నిరాశే మిగిలింది. అంచనాలకు తగ్గట్టుగానే ఫైనల్ కు వెళ్లిన రోహిత్ సేన ఆస్ట్రేలియా అడ్డంకిని అధిగమించలేకపోయింది. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో భారత్ పై గెలిచి ఆరోసారి ప్రపంచ ఛాంపియన్ గా అవతరిందింది.
వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా ఓటమిని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతన్నారు. ఈ మ్యాచ్ భారత్ ఓడిపోవడానికి ఓపెనర్ ట్రావిస్ హెడ్ కారణం. అతని వీరోచిత సెంచరీ కారణంగానే భారత్ చేతుల్లో నుంచి మ్యాచ్ చేజారింది. ఇదిలా ఉంటే ఆసీస్ క్రికెటర్ ట్రావిస్ హెడ్ భార్య ఈ ఓటమి చేదు జ్ఞాపకాన్ని మరోసారి గుర్తు చేసింది. ఇంస్టాగ్రామ్ లో “నో స్కిప్పింగ్..! "యు ఇన్ నవంబర్ లాస్ట్ ఇయర్" అని పోస్ట్ చేసింది. తన కూతురుని ఎత్తుకున్న ఫోటోను షేర్ చేయడంతో పాటు.. జెస్ "IYKYK" అనే క్యాప్షన్‌ను జోడించింది. "మీకు తెలిస్తే, మీకు తెలుసు" అని దీని అర్ధం.
ALSO READ | AUS vs IND: ఇదెక్కడి మాస్ ఫాలోయింగ్: కోహ్లీ ప్రాక్టీస్ చూడడానికి చెట్టెక్కిన అభిమానులు
ఈ ఫైనల్ లో తొలుత భారత బ్యాటర్లను 240 పరుగులకే కట్టడిచేసిన కంగారూ జట్టు.. అనంతరం లక్ష్యాన్ని కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించి విశ్వవిజేతగా అవతరించింది. ఆసీస్ యువ బ్యాటర్ ట్రావిస్ హెడ్ (137; 120 బంతుల్లో 15 ఫోర్లు, 5 సిక్స్ లు) ఏకంగా సెంచరీ బాదాడు. అతనికి మరో ఎండ్ నుంచి మార్నస్ లబుషేన్( 58 నాటౌట్; 110 బంతుల్లో 4 ఫోర్లు) చక్కని సహకారం అందించాడు.
Travis Head's wife remembering last November. 🥲 pic.twitter.com/I6XZ1Nlmrh
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 14, 2024