యూఎస్ ఓపెన్ 2024 లో మహిళల విభాగంలో అరీనా సబలెంకా ఫైనల్ కు చేరుకుంది. గురువారం( సెప్టెంబర్ 5) అర్దరాత్రి జరిగిన సెమీ ఫైనల్లో బెలారసియన్ స్టార్ అమెరికన్ ఎమ్మా నవారోపై 6-3, 7-6(2) తేడాతో వరుస సెట్లలో గెలిచింది. ఈ విజయంతో సబలెంకా వరుసగా రెండో సారి యూఎస్ ఓపెన్ ఫైనల్ కు చేరుకొని చరిత్ర సృష్టించింది. 2018, 2019లో సెరెనా విలియమ్స్ తొలిసారి ఈ ఫీట్ సాధించగా.. సబలెంకా అదే ఫీట్ ను రిపీట్ చేసింది.
Also Read :- గైక్వాడ్ కాళ్ళు మొక్కిన అభిమాని
2023 ఫైనల్లో కోకా గాఫ్ పై సబలెంకా పోరాడి ఓడిపోయింది. అమెరికా ఆశ కిరణం ప్రత్యర్థి బెలారసియన్ ఎమ్మా నవారో టోర్నీ నుంచి నిష్క్రమించింది. నవ్వారో ఓడిపోయిన మరో సెమీ ఫైనల్లో అమెరికన్ ప్లేయర్ జెస్సికా పెగులా ఫైనల్ కు దూసుకెళ్లింది. ఆమె ముచోవాపై 1-6, 6-4, 6-2 తేడాతో ఓడిపోయే మ్యాచ్ లో గెలిచింది. ఈ మ్యాచ్ లో తొలి సెట్ ను ఓడిపోయిన పెగులా రెండో సెట్ లో 0-2 తో వెనకబడింది. అయితే అద్భుతంగా పుంజుకున్న ఆమె రెండో సెట్ ని చేజిక్కించుకుంది. నిర్ణయాత్మకమైన మూడో సెట్ లో ప్రత్యర్థికి అసలు అవకాశమివ్వలేదు. 6-2 తో అలవోకగా నెగ్గింది. శనివారం (సెప్టెంబర్ 8) ఫైనల్ లో సబలెంకాతో పెగులా తలబడనుంది.
Aryna Sabalenka and Jessica Pegula will face each other in the final of the US Open.
— The Tennis Letter (@TheTennisLetter) September 6, 2024
Aryna leads the head to head 5-2 and won their most recent meeting in Cincinnati last month.
She’s also won 5 of their last 6 matches.
Aryna already has a Grand Slam title under her belt… pic.twitter.com/iq2o0sY8bl