
న్యూఢిల్లీ: లాంగ్ జంపర్ జెస్విన్ అల్డ్రిన్, 5000 మీటర్ల రన్నర్ అంకిత ధ్యాని పారిస్ ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయ్యారు. వరల్డ్ ర్యాంకింగ్ ద్వారా ఈ ఇద్దరూ పారిస్ కోటా దక్కించుకున్నారు. దాంతో ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొనే ఇండియా అథ్లెటిక్స్ జట్టు సభ్యుల సంఖ్య 30కి పరిగింది. మరో లాంగ్ జంపర్ శ్రీశంకర్ గాయం కారణంగా ఒలింపిక్స్‌కు దూరం అవ్వడంతో అతని కోటాను జెస్విన్‌తో భర్తీ చేశారు.