మనీ లాండరింగ్ కేసు.. నరేశ్ గోయల్‌కు బెయిల్

మనీ లాండరింగ్ కేసు.. నరేశ్ గోయల్‌కు బెయిల్

న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ కేసులో   జెట్ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేస్‌‌‌‌‌‌‌‌ ఫౌండర్ నరేష్ గోయెల్‌‌‌‌‌‌‌‌కు బాంబే హైకోర్ట్  సోమవారం బెయిల్‌‌‌‌‌‌‌‌ మంజూరు చేసింది. గతంలో ఇచ్చిన తాత్కాలిక బెయిల్‌కు ఇది పొడిగింపు. కెనరా బ్యాంక్ జెట్‌‌‌‌‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేస్‌‌‌‌‌‌‌‌కు ఇచ్చిన  రూ.538 కోట్ల లోన్‌‌‌‌‌‌‌‌ను  దారి మళ్లించారనే ఆరోపణలపై  నరేష్ గోయెల్‌‌‌‌‌‌‌‌ను కిందటేడాది ఈడీ అరెస్ట్ చేసింది. ఆయన్ని ఆర్థర్ రోడ్ జైల్‌‌‌‌‌‌‌‌లో  ఉంచారు. కెనరా బ్యాంక్ ఫిర్యాదుపై సీబీఐ ఫైల్ చేసిన ఎఫ్‌ఐఆర్‌‌ ఆధారంగా ఈడీ కేసు బుక్ చేసింది.