
- వాణిజ్య ఎల్పీజీ రూ. 69 తగ్గింపు
న్యూఢిల్లీ: విమానాల్లో వాడే జెట్ ఇంధనం లేదా ఏటీఎఫ్ ధర 6.5 శాతం తగ్గింది. హోటళ్లు, రెస్టారెంట్లు ఉపయోగించే వాణిజ్య ఎల్పీజీ ధర రూ. 69 తగ్గింది. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్రం ప్రకటించింది.
ఏటీఎఫ్ ధర కిలోలీటర్‌కు రూ. 6,673.87 తగ్గడంతో దేశ రాజధానిలో కిలోలీటర్‌కు రూ. 94,969.01కి పడిపోయింది. ముంబైలో ఏటీఎఫ్ రేటు కిలోలీటర్‌కు రూ.95,173.70 నుంచి రూ.88,834.27కి తగ్గింది. స్థానిక పన్నులను బట్టి ధరలు ఒక్కో రాష్ట్రానికి మారుతూ ఉంటాయి.