కమర్షియల్ ఫ్లైట్స్ కన్నా జెట్స్, చార్టర్డ్ ఫ్లైట్స్‌కే డిమాండ్

కమర్షియల్ ఫ్లైట్స్ కన్నా జెట్స్, చార్టర్డ్ ఫ్లైట్స్‌కే డిమాండ్

జెట్స్, చార్టర్డ్​ ఫ్లయిట్స్‌‌కే డిమాండ్

కమర్షియల్ ఫ్లయిట్ ఎక్కేందుకు దూరం
బిహార్ ఎన్నికల్లోనూ హెలికాప్టర్స్‌ నే వాడారు

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో బిజినెస్ జెట్స్‌‌‌‌కు, చార్టర్డ్​  ఫ్లయిట్స్‌‌‌‌కు డిమాండ్ పెరిగింది. కరోనా భయానికి కమర్షియల్ ఫ్లయిట్స్ ఎక్కేందుకు ట్రావెలర్స్ భయపడుతున్నారు. దీంతో బిజినెస్ జెట్‌‌‌‌లను, చార్టర్డ్​  ఫ్లయిట్స్‌‌‌‌ను ఎక్కువగా వాడుతున్నారు. ఏడాది తర్వాత మొట్టమొదటిసారి ఫెస్టివ్ నెలలో బిజినెస్ జెట్, హెలికాప్టర్ ఆపరేటర్లు పాజిటివ్ గ్రోత్‌‌‌‌ను సాధించారు. అంతేకాక ఇటీవల జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల క్యాంపెయిన్‌‌‌‌ కోసం కూడా పొలిటీషియన్లు ఎక్కువగా హెలికాప్టర్లను వాడారు. జనరల్ ఏవియేషన్ మూవ్‌‌‌‌మెంట్స్ 9.4 శాతం పెరిగి 23,140గా ఉన్నట్టు ప్రభుత్వ డేటాలో తెలిసింది. గతేడాది ఈ మూవ్‌‌‌‌మెంట్స్ 21,160గా ఉన్నాయి. ఫెస్టివ్ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి చార్టర్డ్​  ఫ్లయిట్స్, బిజినెస్ జెట్ ఆపరేటర్లకు పాజిటివ్ గ్రోత్ రికార్డవ్వడం మొదలైంది. ఈ డిమాండ్ నవంబర్‌‌‌‌‌‌‌‌లో కూడా కొనసాగుతోంది. తమ గెస్ట్‌‌‌‌లలో చాలా మంది దసరా, దీపావళి ఫెస్టివ్ కాలంలో ప్రైవేట్ జెట్‌‌‌‌లను హైర్ చేసుకున్నారని న్యూఢిల్లీకి చెందిన జెట్‌‌‌‌సెట్‌‌‌‌గో ఫౌండర్ కనికా తేక్రివాల్ చెప్పారు. చార్టర్డ్​  ఫ్లయిట్స్ అందిస్తోన్న ప్రయోజనాలను చాలా మంది ఇప్పుడే తెలుసుకుంటున్నారని పేర్కొన్నారు. సేఫ్ ట్రావెల్‌‌‌‌ను, మినిమమ్ టచ్ పాయింట్లను ఇవి ఆఫర్ చేస్తున్నాయని అన్నారు. చార్టర్డ్​  ఫ్లయిట్స్ లగ్జరీవి కావని బిజినెస్ జెట్ ఆపరేటర్లు చెబుతున్నారు. వీటిని ఎంచుకుంటే ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌లలో క్యూలుండవు.  ఎక్కువ రద్దీ కూడా ఉండదు. క్రూ సిబ్బంది కూడా చాలా తక్కువగా ఉంటారు.   ఎయిర్‌‌‌‌‌‌‌‌క్రాఫ్ట్‌‌ ను ఎప్పడికప్పుడు శానిటైజ్ చేస్తూ ఉంటామని క్లబ్ వన్ ఎయిర్‌‌‌‌‌‌‌‌ రాజన్ మెహ్రా అన్నారు. మెహ్రా అంతకుముందు ఖతర్ ఎయిర్‌‌‌‌‌‌‌‌వేస్‌‌‌‌లో పనిచేశారు. బిజినెస్ జెట్స్ డబుల్ డిజిట్ గ్రోత్‌‌‌‌ను నమోదు చేస్తున్నాయని పేర్కొన్నారు. డొమెస్టిక్ ఎయిర్ ట్రావెల్ ప్రీ కరోనా లెవెల్స్‌‌లో 65 శాతానికి వచ్చినట్టు సివిల్ ఏవియేషన్ సెక్రటరీ ప్రదీప్ సింగ్ ఖరోలా తెలిపారు.

2020 అక్టోబర్‌ లో బిజినెస్‌‌‌‌ జెట్స్‌‌కు 9.7 శాతం పెరిగిన డిమాండ్
ఎలాంటి రద్దీలేని శానిటైజ్ చేసిన చిన్న ఫ్లయిట్స్‌‌‌‌ వైపే ట్రావెలర్ల మొగ్గు
ఏడాది చివరి వరకు ప్రీ కరోనా లెవెల్స్‌‌‌‌కు చేరుకుంటారని అంచనా
హెలికాప్టర్ ఆపరేటర్లకు బిహార్ ఎలక్షన్స్ బూస్ట్

For More News..

నోటాకైనా వేయండి కానీ ఓటేయకుండా ఉండొద్దు