రూ.2 కోట్ల గోల్డ్తో నగల వ్యాపారి జంప్.. పీఎస్కు క్యూ కట్టిన బాధితులు

రూ.2 కోట్ల గోల్డ్తో నగల వ్యాపారి జంప్.. పీఎస్కు క్యూ కట్టిన బాధితులు

 నగల తయారీ  కోసం బంగారం ఆర్డరిస్తే నగల వ్యాపారీ నిండా ముంచాడు. కస్టమర్స్ నుంచి  బంగారం తీసుకుని రాత్రికి రాత్రే ఫ్యామిలీతో జంప్ అయ్యాడు. నమ్మి నట్టేట ముంచాడు కేటుగాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో జరిగింది. 

బాధితుల ఫిర్యాదు చేసిన వివరాల ప్రకారం..  మహారాష్ట్రకు చెందిన బంగారు నగల వ్యాపారి తోరత్ సీతారాం ఆయన ఇద్దరు కుమారులు ప్రవీణ్, ప్రశాంత్ లు గత 30 సంవత్సరాలుగా  మంథని పట్టణంలో  ధనలక్ష్మి జువెలర్స్ షాపు నిర్వహిస్తున్నారు.  మంథనితో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన చాలా మంది ధనలక్ష్మి జువెలర్స్ షాప్ లో నగల  తయారీకి బంగారం ఇచ్చారు.  ధనలక్ష్మి జ్యూవెలర్స్ షాపు యజమానులు వారికున్న పరిచయాలతో ప్రజలను నమ్మించి అప్పులు చేసి డబ్బులతో పాటు బంగారం, వెండి తీసుకొని వారం రోజుల క్రితం పరారయ్యారు. బాధితులకు మరుసటి రోజు ఈ విషయం తెలిసినప్పటికీ  ప్రయాగ్రాజ్ కుంభమేళాకు వెళ్లినట్టు ఒక ప్రచారం జరిగింది. వారం రోజులైనా తిరిగి రాకపోవడం, వారి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో బాధితులంతా మోసపోయమని గమనించి మార్చి 8న  మంథని పోలీస్ స్టేషన్ కు క్యూ కట్టారు. 

కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మంథని పోలీసులు. సుమారు 52 మంది బాధితుల నుంచి 78 గ్రాముల బంగారంతో పాటు ఒక కేజీ వెండి 52 లక్షల రూపాయలు నగదుకు సంబంధించి  ఇప్పటివరకు ఫిర్యాదులు అందినట్లు పోలీసులు తెలిపారు. బాధితులు ఇంకా మరి కొంతమంది ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది.