
జగిత్యాల టౌన్, వెలుగు : బస్సు కోసం వేచి ఉన్న మహిళ బ్యాగులోంచి గుర్తు తెలియని వ్యక్తులు 15 తులాల బంగారు నగలు చోరీ చేశారు. ఈ ఘటన జగిత్యాల బస్టాండ్‌లో శుక్రవారం జరిగింది. మెట్‌పల్లిలోని వెల్లుల్లకు చెందిన సురిగి మంగరాణి తన కూతురితో కలిసి బీర్పూర్ మండలంలో జరిగిన ఒక ఫంక్షన్‌కు హాజరైంది. తిరుగు ప్రయాణంలో జగిత్యాలకు వచ్చి కొత్త బస్టాండ్‌లో బస్సు కోసం వేచి చూస్తోంది. కొద్ది సేపటికి తన బ్యాగులో ఉన్న నగలు చోరీ అయినట్లు గుర్తించి జగిత్యాల టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జగిత్యాల టౌన్ సీఐ వేణుగోపాల్, ఎస్సై నరేశ్ బస్టాండ్‌కు చేరుకొని కంట్రోల్ రూమ్‌లోని సీసీ ఫుటేజీలను పరిశీలించారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.