కాంగ్రెస్‌‌‌‌ గెలుపే  లక్ష్యంగా పనిచేయాలి: ఝాన్సీరెడ్డి

కాంగ్రెస్‌‌‌‌ గెలుపే  లక్ష్యంగా పనిచేయాలి: ఝాన్సీరెడ్డి

పాలకుర్తి, వెలుగు : కాంగ్రెస్‌‌‌‌ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని ఆ పార్టీ నాయకురాలు ఝాన్సీరెడ్డి పిలుపునిచ్చారు. పాలకుర్తి, కొడకండ్ల ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఆదివారం జనగామ జిల్లా పాలకుర్తిలో బ్లాక్‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌‌‌‌ ప్రకటించిన ఆరు గ్యారంటీలు ప్రతి ఇంటికి చేరేలా కార్యకర్తలంతా కష్టపడి పనిచేయాలని సూచించారు. అన్ని రకాల కమిటీలు ప్రణాళికాప్రకారం పనిచేయాలని సూచించారు.  

అధికార పార్టీ అవినీతి, అక్రమాలను ప్రజలకు వివరించాలని, వాటిని ఎప్పటికప్పుడు ప్రశ్నించాలన్నారు. సమావేశంలో పాలకుర్తి మండల అధ్యక్షుడు కుమారస్వామి, కొడకండ్ల మండల అధ్యక్షుడు సురేశ్‌‌‌‌, పీసీసీ నాయకులు నిరంజన్‌‌‌‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ రఘు, నాయకులు రఘు, హరీశ్‌‌‌‌ పాల్గొన్నారు.