తనదైన నటనతో సిల్వర్ స్క్రీన్‌పై మెప్పించిన అంజలి, ఇటీవల ‘ఝాన్సీ’ వెబ్ సిరీస్‌తో ఓటీటీలోనూ కనిపించింది. ఆమె లీడ్ రోల్‌లో నటించిన ఈ సిరీస్‌కు డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో మంచి ఆదరణ లభించింది. యాక్షన్ ఓరియెంటెడ్ క్యారెక్టర్‌లో అంజలి చేసిన స్టంట్స్ ఆకట్టుకున్నాయి. దర్శకుడు తిరు ఈ వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేశారు. ట్రైబల్ హార్స్ ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్‌పై కృష్ణ నిర్మించారు.
సైకలాజికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ‘ఝాన్సీ’ వెబ్ సిరీస్‌కు ఇప్పుడు సెకెండ్ పార్ట్ రాబోతోంది. జనవరిలో సీజన్ 2 స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది. ఇందులో అభి రామ్, ఆదర్శ్ బాలకృష్ణ, సంయుక్త హార్నాడ్, చాందినీ చౌదరి, శరణ్య, రాజ్ అర్జున్, కళ్యాణ్ మాస్టర్, ముమైత్ ఖాన్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.