జార్ఖండ్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ధన్ బాద్ లోని ఓ హాస్పిటల్ కాంప్లెక్స్ లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఐదుగురు సజీవదహనం అయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఓ డాక్టర్ దంపతులతో పాటు వారి బంధువు, మరో ఇద్దరు సిబ్బంది ఉన్నారని ధన్ బాద్ డీఎస్పీ అరవింద్ కుమార్ చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.