రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం 2024, అక్టోబర్ 15న ప్రకటించింది. ఎన్నికల వివరాలను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈసీ షెడ్యూల్ ప్రకారం.. మొత్తం రెండు దశల్లో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఫస్ట్ ఫేజ్ లో 43 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఎన్నికలు జరగనుండగా.. రెండో దశలో 38 స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. తొలి దశ పోలింగ్ 2024, నవంబర్ 13వ తేదీన జరగనుంది.
సెకండ్ ఫేజ్ ఎలక్షన్స్ 2024, నవంబర్ 20న జరగనున్నాయి. 2024, నవంబర్ 23న జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్, ఫలితాలు విడుదల కానున్నాయి. జార్ఖండ్లో ప్రస్తుతం జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి అధికారంలో ఉంది. ఈ కూటమిని గద్దె దించి ఎలాగైనా ఈ సారి జార్ఖండ్లో పాగా వేయాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోండగా.. కాషాయ పార్టీని మట్టి కరిపించి అధికారం నిలబెట్టుకోవాలని కూటమి ప్రణాళికలు రచిస్తోంది. మరి జార్ఖండ్లో ఏ పార్టీ, కూటమి విజయం సాధిస్తోందో తెలియాలంటే నవంబర్ 23వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే.
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పూర్తి షెడ్యూల్:
- మొత్తం 81 అసెంబ్లీ సీట్లు
- జనరల్ 44
- ఎస్సీ 28
- ఎస్టీ 9
మొత్తం ఓటర్లు 2.6 కోట్లు
- 1.29 కోట్లు మహిళా ఓటర్లు
- 1.31 కోట్లు పురుష ఓటర్లు
- 66.84 లక్షల మంది యంగ్ ఓటర్లు
ఫస్ట్ ఫేజ్ ఎన్నికల షెడ్యూల్:
- ఎలక్షన్ గెజిట్ నోటిఫికేషన్: 18/10/2024
- నామినేషన్ల దాఖలకు చివరి తేదీ: 25/10/ 2024
- నామినేషన్ల పరిశీలన: 28/10/ 2024
- నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: 30/10/ 2024
- పోలింగ్ జరుగు తేదీ: 13/11/ 2024
- కౌంటింగ్ తేదీ: 23/11/ 2024
సెకండ్ ఫేజ్ ఎన్నికల షెడ్యూల్:
- ఎలక్షన్ గెజిట్ నోటిఫికేషన్: 22/10/2024
- నామినేషన్ల దాఖలకు చివరి తేదీ: 29/10/ 2024
- నామినేషన్ల పరిశీలన: 30/10/ 2024
- నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: 1/11/ 2024
- పోలింగ్ జరుగు తేదీ: 20/11/ 2024
- కౌంటింగ్ తేదీ: 23/11/ 2024