ప్రతిపక్ష ఎమ్మెల్యేలతో హోలీ ఆడిన సీఎం

ప్రతిపక్ష ఎమ్మెల్యేలతో హోలీ ఆడిన సీఎం

దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు మొదలయ్యాయి. హోలీని భారత ప్రజలు ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. మరో రెండు రోజుల్లో హోలీ పండగ రానుంది. ఈ క్రమంలో జార్ఖండ్ శాసనసభలో ఎమ్మెల్యేలందరూ హోలీ వేడుకలు చేసుకున్నారు. రాంచీలోని జార్ఖండ్‌ శాసనసభలో జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌తోపాటు అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలంతా హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. సీఎం... శాసన సభ్యులందరితో కలిసి సందడిగా గడిపారు. రంగులు పూసుకుంటూ.. భజనలు, పాటలు పాడుతూ.. సరదాగా గడిపారు. 

అయితే  కరోనా వైరస్  కారణంగా గత రెండేళ్లుగా ప్రజలంతా అన్నిరకాల పండగలకు దూరమయ్యారు. కోవిడ్ కఠినమైన సమయం తర్వాత, మనమందరం ఈ పండుగను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు సీఎం. రాష్ట్రంలోని ప్రతి ఒకరు.. సురక్షితమైన సంపన్నమైన హోలీని జరుపుకోవాలని కోరుకుంటున్నానని తెలిపారు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్. 

 

ఇవి కూడా చదవండి

వచ్చే ఎన్నికల్లో 50 మందికి ఎమ్మెల్యే సీట్లు డౌటే!