తక్షణమే డీజీపీని తొలగించండి: రాష్ట్ర ప్రభుత్వానికి ఈసీ ఆదేశం

తక్షణమే డీజీపీని తొలగించండి: రాష్ట్ర ప్రభుత్వానికి ఈసీ ఆదేశం

రాంచీ: జార్ఖండ్‎లో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం షూరు అయ్యింది. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‎ను 2024, అక్టోబర్ 15వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించడంతో రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికల కసరత్తులో మునిగిపోయాయి. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈసీ సైతం యాక్షన్ స్టార్ట్ చేసింది. ప్రభుత్వ అధికారుల బదిలీలు, నియమాకాలపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే జార్ఖండ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)పై ఈసీ వేటు వేసింది. జార్ఖండ్ తాత్కలిక డీజీపీ అనురాగ్ గుప్తాను తక్షణమే యాక్టింగ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పదవి నుండి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈసీ ఆదేశించింది.

అనురాగ్ గుప్తా స్థానంలో సీనియర్ మోస్ట్ డీజీపీ స్థాయి అధికారిని అపాయింట్ చేయాలని స్టేట్ గవర్నమెంట్‎కు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు 2024, అక్టోబర్ 19న ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, జార్ఖండ్‎లోని మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు ఈ సారి రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశ పోలింగ్ 2024, నవంబర్ 13న, సెకండ్ ఫేజ్ ఎలక్షన్స్  2024, నవంబర్ 13వ తేదీన ఈసీ నిర్వహించనుంది. 2024, నవంబర్ 23వ తేదీన కౌంటింగ్, ఫలితాలు విడుదల కానున్నాయి. 

ALSO READ : ఎలక్షన్ కమిషన్ ఆదేశం..17వందల సోషల్ మీడియా ఖాతాలు బ్యాన్
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పూర్తి షెడ్యూల్:

  • మొత్తం 81 అసెంబ్లీ సీట్లు (జనరల్ 44, ఎస్సీ 28, ఎస్టీ 9)
  • మొత్తం ఓటర్లు 2.6 కోట్లు
  • 1.29 కోట్లు మహిళా ఓటర్లు
  • 1.31 కోట్లు పురుష ఓటర్లు
  • 66.84 లక్షల మంది యంగ్ ఓటర్లు

ఫస్ట్ ఫేజ్ ఎన్నికల షెడ్యూల్:

  • ఎలక్షన్ గెజిట్ నోటిఫికేషన్: 18/10/2024
  • నామినేషన్ల దాఖలకు చివరి తేదీ: 25/10/ 2024
  • నామినేషన్ల పరిశీలన: 28/10/ 2024
  • నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: 30/10/ 2024
  • పోలింగ్ జరుగు తేదీ: 13/11/ 2024
  • కౌంటింగ్ తేదీ: 23/11/ 2024

సెకండ్ ఫేజ్ ఎన్నికల షెడ్యూల్:

  • ఎలక్షన్ గెజిట్ నోటిఫికేషన్: 22/10/2024
  • నామినేషన్ల దాఖలకు చివరి తేదీ: 29/10/ 2024
  • నామినేషన్ల పరిశీలన: 30/10/ 2024
  • నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: 1/11/ 2024
  • పోలింగ్ జరుగు తేదీ: 20/11/ 2024
  • కౌంటింగ్ తేదీ: 23/11/ 2024