రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోరు ముగిసింది. ఈ సారి మొత్తం రెండు దశల్లో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగింది. 2024 నవంబర్ 13 ఫస్ట్ ఫేజ్, నవంబర్ 20న సెకండ్ ఫేజ్ ఎన్నికలు జరిగాయి. జార్ఖండ్‌లోని మొత్తం 81 అసెంబ్లీ సీట్లలో గెలుపే లక్ష్యంగా ఇండియా, ఎన్డీఏ కూటములు హోరాహోరీగా తలపడ్డాయి. మరోసారి అధికారం నిలబెట్టుకోవాలని ఇండియా కూటమి.. ఈ సారి ఎలాగైనా జార్ఖండ్లో కాషాయ జెండా రెపరెపలాడించాలని బీజేపీ ప్రచారం హోరెత్తించాయి. ఇక ఎన్నికల పోరు ముగియడంతో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ విడుదల అయ్యాయి.
Also Read :- మహారాష్ట్ర పీఠం ఎవరిది.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి
వివిధ సర్వేల ఎగ్జిట్ పోల్స్ అంచనాలు:
పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్:
- ఎన్డీఏ కూటమి 44 నుండి 53 స్థానాలు
- ఇండియా కూటమి 25 నుండి 37 స్థానాలు
- ఇతరులు 5 నుండి 9 స్థానాలు
మ్యాట్రిజ్:
- ఎన్డీఏ కూటమి 42 నుండి 47 స్థానాలు
- ఇండియా కూటమి 25 నుండి 30 స్థానాలు
- ఇతరులు 1 నుండి 5 స్థానాలు
జేవీసీ:
- ఎన్డీఏ కూటమి 40 నుండి 44 స్థానాలు
- ఇండియా కూటమి 30 నుండి 40 స్థానాలు
- ఇతరులు 0 నుండి 1 స్థానం
చాణక్య స్ట్రాటజీస్:
- ఎన్డీఏ కూటమి 45 నుండి 50 స్థానాలు
- ఇండియా కూటమి 35 నుండి 38 స్థానాలు
- ఇతరులు 3 నుండి 5 స్థానాలు
పోల్ ఆఫ్ పోల్స్:
- ఎన్డీఏ కూటమి 43 నుండి 49 స్థానాలు
- ఇండియా కూటమి 29 నుండి 36 స్థానాలు
- ఇతరులు 2 నుండి 5 స్థానాలు
జార్ఖండ్ ఓటర్లు ఏ పార్టీకి పట్టం కట్టారు..? ఏ పార్టీ విజయం సాధించనుందనే దానిపై పలు సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలను వెల్లడించాయి. మెజార్టీ ఎగ్జిట్స్ పోల్స్.. ఈ సారి జార్ఖండ్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తోందని అంచనా వేశాయి. ఎన్డీఏ కూటమి జార్ఖండ్లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 41 సీట్ల మ్యాజిక్ ఫిగర్ ను సాధించి అధికారం చేపడుతోందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి.
అన్ని ఎగ్జిట్ పోల్స్ అధికార జేఎంఎం పార్టీకి షాకిచ్చాయి. జేఎంఎం నేతృత్వంలోని ఇండియా కూటమికి ఈ సారి ఓటమి తప్పదని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడ్డాయి. కాగా, 81 శాసనసభ స్థానాలున్న జార్ఖండ్లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 41. మ్యాజిక్ ఫిగర్ 41 స్థానాలు సాధించిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు.