
పోలీస్ ఎన్కౌంటర్లో జార్ఖండ్కు చెందిన కరుడుగట్టిన గ్యాంగ్స్టర్ అమన్ సోహాను మృతిచెందాడు. సోమవారం (మార్చి 11) న ఉదయం పోలీస్ కస్టడీలో ఉన్న అమన్ సోహాను రాయ్పూర్ నుంచి రాంచీకి తరలిస్తుండగా గ్యాంగ్ సభ్యులు అతన్ని విడిపించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో జరిగిన ఎన్ కౌంటర్లో అమన్ సాహు హతమయ్యారు.
150కి పైగా కేసుల్లో అమన్ నిందితుడిగా ఉన్నారు. చాలా కేసుల్లో దోషిగా ఛత్తీస్ గఢ్లోని రాయ్పూర్ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ముగ్గురు గ్యాంగ్స్టర్లు వికాస్ తివారి, అమన్ శ్రీవాస్తవ, అమన్ సాహో జైలునుంచే చీకటి కార్యకలాపాలు నడిపిస్తున్నారని జార్ఖండ్ పోలీసులు తెలిపారు.
ALSO READ | ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం.. మంటల్లో ముగ్గురు సజీవ దహనం
అకస్మాత్తుగా సావో ముఠా సభ్యులు అతన్ని తీసుకువస్తున్న వాహనంపై దాడి చేశారు. రామ్ గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంధేరీ టోలా సమపీంలో అమన్ ను విడిపించేందుకు ముఠా సభ్యులు కాల్పులు జరిపారు. పోలీసులు ఎదురు కాల్పుల్లో అమన్ మృతిచెందాడు. పోలీసు సిబ్బంది గాయపడినట్టు పోలీసులు తెలిపారు.
మరోవైపు జార్ఖండ్ లోని వేర్వేరు ఆపరేషన్లలో పలువురు నక్సలైట్లు అరెస్టయ్యారు.
మార్చి 10 జార్ఖండ్ లో వేర్వేరు ఆపరేషన్లలో ఇద్దరు నక్సలైట్లు అరెస్ట్ చేశారు. ఛత్రా జిల్లాలో TPSC సభ్యుడు రంతు గంజును అతని ఇంట్లో అరెస్ట్ చేశారు. మరో ఆపరేషన్ లో పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PLFI) సభ్యుడిని లతేహార్ జిల్లాలో అరెస్ట్ చేశారు. స్థానిక వ్యాపారులను బెదిరిస్తున్న వినోద్ పర్షియా ను పోలీసులు అరెస్ట్ చేశారు.