దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో పలు రాష్ట్రాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. ఝార్ఖండ్‌లో కేసులు పెరుగుతుండటంతో ఆంక్షలను జనవరి 31వరకు పొడిగించారు. అక్కడ విద్యాసంస్థలను ఇప్పటికే మూసివేశారు. పెళ్లిళ్లకు కేవలం 100 మందిని మాత్రమే అనుమతిస్తున్నారు. మార్కెట్లను రాత్రి 8 గంటలకే మూసివేస్తున్నారు. ప్రస్తుతం ఝార్ఖండ్‌లో 3,258 కరోనా కేసులు, 14 ఒమిక్రాన్ కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కరోనా కారణంగా శనివారం ఏడుగురు మరణించారు.
తమిళనాడులో వీకెండ్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. అత్యవసర సర్వీసులు మినహా.. ఎవర్నీ బయటకు అనుమతించడం లేదు. పెళ్లిళ్లకు కేవలం 100 మందిని మాత్రమే అనుమతిస్తున్నారు. ఆర్టీసీ బస్సులను 75శాతం కెపాసిటీతో రన్ చేస్తున్నారు. ప్రార్థనా స్థలాలను, శాపింగ్ మాల్స్‌ను పూర్తిగా మూసివేశారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు. అయినా కూడా తమిళనాడులో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే అక్కడ 23 వేల 989 కేసులు నమోదు కాగా.. 11 మంది మరణించారు.
ఇటు ఢిల్లీ, జమ్మూకాశ్మీర్‌లోనూ వీకెండ్ లాక్డౌన్ కొనసాగుతోంది. సాధారణ రోజుల్లో కఠిన ఆంక్షలు కొనసాగిస్తున్నారు. సినిమా హాళ్లు , థియేటర్లు, మల్టీప్లెక్స్లు థియేటర్లు, రెస్టారెంట్లు, క్లబ్బులు, జిమ్ములు 25శాతం సామర్థ్యంతో రన్ చేస్తున్నారు. విద్యాసంస్థలు పూర్తిగా మూసివేసి.. ఆన్ లైన్ క్లాసులు చెబుతున్నారు.
For More News..