లీటర్ పెట్రోల్ ధర రూ.25 తగ్గింపు

లీటర్ పెట్రోల్ ధర రూ.25 తగ్గింపు

జార్ఖండ్ : జార్ఖండ్ ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ద్విచక్రవాహనదారులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. లీటర్ పెట్రోల్ పై రూ.25 రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ పథకం 2022 జనవరి 26 నుంచి అమల్లోకి వస్తుందని జార్ఖండ్ సీఎంఓ ట్విట్టర్లో ట్వీట్ చేసింది. టూవీలర్ లో నింపిన ప్రతి లీటర్ కు రూ.25 నగదును నేరుగా ప్రజల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తామని హేమంత్ సోరెన్ వెల్లడించారు. ప్రతి వాహనదారుడికి 10 లీటర్ల వరకు ఈ సదుపాయం పొందే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు.
"పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అందుకే రాష్ట్రంలో ద్విచక్ర వాహనదారులకు లీటరుపై రూ.25 తగ్గించి ఉపశమనం కల్పిస్తున్నాం. ఇది జనవరి 26 నుంచి అమల్లోకి వస్తుంది" అని ట్వీట్ లో పేర్కొన్నారు.
గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు గణనీయంగా పెరిగాయి. లీటర్ పెట్రోల్ ధర రూ.100 దాటడంతో దీపావళి సందర్భంగా కేంద్రం పెట్రోల్ పై రూ.5, డీజిల్ పై రూ.10 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా హేమంత్ సోరెన్ ప్రభుత్వం తమ జార్ఖండ్ వాసులకు మరింత ఊరటనిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. సోరెన్ నిర్ణయంపై ఆ రాష్ట్ర ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

For more news..

ఇళ్ళ మధ్యలో పబ్ లు.. రేపటి లోగా పూర్తి వివరాలు ఇవ్వాలి

సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ