ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జరుపుకునే ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా ఘనంగా ఆరంభమైన విషయం తెలిసిందే. గంగ, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమానికి నెలవైన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్ ఈ మహా కుంభమేళాకు వేదిక. మొత్తం 45 రోజుల పాటు సాగే ఈ కుంభమేళాకు భక్తులు పోటెత్తనున్నారు.
పుష్య పౌర్ణమి రోజైన సోమవారం తెల్లవారుజామునుంచే లక్షలాది మంది భక్తులు త్రివేణి సంగమానికి చేరుకొని పుణ్య స్నానాలు ఆచరించి పూజలు చేస్తున్నారు. ఉదయం 7:30 గంటలకే దాదాపు 35 లక్షల మంది భక్తులు త్రివేణీ సంగమంలో స్నానాలు చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఇంతమంది భక్తులు ఒకేచోట అంటే.. తప్పిపోతే కనిపెట్టడం చాలా కష్టం. నా దగ్గర ఆధార్ కార్డు ఉంది.. మా వాళ్లు ఇక్కడే ఎక్కడో ఓ చోట మాకోసం వెతుకుంటారు.. అని అధికారులను, పోలీస్ సిబ్బందిని వేడుకున్నా ప్రయోజం ఉండదు. అటువంటి కష్టాలు మీకు ఎదురవ్వడకూడదు అనుకుంటే.. ఇదిగో ఈ ఇద్దరి అక్కచెల్లెళ్లలా ఏదో ఒక పరిష్కారంతో ముందుకెళ్లండి.
ఎర్ర రిబ్బన్‌తో చేతులు ముడేశారు..
జార్ఖండ్‌కు చెందిన ఇద్దరు సోదరీమణులు గీత, లలిత మహా కుంభమేళాకు విచ్చేశారు. వీరిరువురు తప్పిపోకుండా ఉండేందుకు తమ చేతికున్న గాజులకు ఎర్రటి రిబ్బన్‌తో కట్టుకున్నారు. ఈ ఇద్దరి అక్కాచెల్లెళ్లు గత రెండు రోజులుగా ప్రయాగ్‌రాజ్ చుట్టూ ఎర్రటి రిబ్బన్‌తోనే తిరుగుతున్నారట. టాయిలెట్‌కు వెళ్లినప్పుడు మాత్రమే రిబ్బన్ విప్పుతారట. తప్పిపోతే కనిపెట్టడం కష్టం కనుక అలా చేతులను ఎర్రటి రిబ్బన్‌తో కట్టుకున్నట్లు వారు తెలిపారు. వీరిద్దరే కాదు.. చిన్నపిల్లలతో అక్కడికి విచ్చేసిన చాలా మంది భక్తులు ఏదో ఒక ఉపాయంతో ముందుకు సాగుతున్నారు.
ఒకేవేళ మీరు మహా కుంభోత్సవానికి హాజరవుంతుంటే.. వీరిలా ఏదో ఒక ఉపాయాన్ని ఆచరించండి. ఈ ఏడాది మహా కుంభమేళాకు దాదాపు 35 కోట్ల మంది భక్తులు వస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. అంతమందిలో తప్పిపోతే.. మీరు ఇంటికి చేరేవరకు భయం భయంగా గడపాల్సి ఉంటుంది. అందువల్ల మీ కుటుంబసభ్యులను వదిలి ఎటూ వెళ్ళకండి.
ALSO READ | మహా కుంభమేళా 2025 : 12 ఏండ్లకు ఒకసారే ఎందుకు..? సూర్య, చంద్రుడు ఒకే రాశిలోకి వచ్చినప్పుడే ఇలా..!