ముంబై: బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మరోసారి సిల్వర్ స్క్రీన్ ను షేక్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. టీమ్ తో కలసి ‘ఝుండ్’గా మాయ చేస్తానంటున్నాడు. పిస్తుల్యా, ఫాండ్రీ, సైరట్ లాంటి మరాఠీ చిత్రాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న నాగరాజ్ మంజులే దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఝుండ్ మూవీని భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, రాజ్ హిరెమత్, సవితా రాజ్ హిరెమత్ తో కలసి నాగరాజ్ మంజులే సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమా టీజర్ తాజాగా రిలీజ్ అయ్యింది. ఇందులో ఫుట్ బాల్ కోచ్ గా అమితాబ్ లుక్ ఆకట్టుకుంది. ఎన్జీవో స్లమ్ సాకర్ ఫౌండర్ విజయ్ బార్సే జీవిత కథతో తెరకెక్కుతున్న ఝుండ్ లో.. మురికివాడలోని పిల్లల్ని జట్టుగా చేసి, వారికి ఫుట్ బాల్ నేర్పించే కోచ్ పాత్రలో బిగ్ బీ కనిపించనున్నాడు.
టీజర్ లో ఎలాంటి డైలాగులు లేనప్పటికీ.. అమితాబ్ పాత్రను రివీల్ చేస్తూ, వీధి పిల్లలను చూపించారు. ఈ టీజర్ ను బిగ్ బీ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేశారు. ‘నా టీమ్ రెడీగా ఉంది, మరి మీరు? మేం వస్తున్నాం. మార్చి 4, 2022 సినిమా థియేటర్లలో కలుసుకుందాం’ అనే క్యాప్షన్ ను ఈ పోస్టుకు జత చేశారు. ఇకపోతే, ఝుండ్ తో పాటు అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో.. రణబీర్ కపూర్, అలియా భట్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న భారీ బడ్జెట్ ఫిల్మ్ బ్రహ్మాస్త్రలోనూ అమితాబ్ యాక్ట్ చేస్తున్నారు. ఇందులో టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా నటిస్తుంటం విశేషం. హాలీవుడ్ రీమేక్ ఇంటర్న్ లో దీపికా పదుకొణెతో కలసి బిగ్ బీ అలరించనున్నారు.
మరిన్ని వార్తల కోసం:
కేరళ ట్రెక్కర్‌ను రక్షించిన ఆర్మీ
అభివృద్ధిని చూసి ఓర్వలేకనే కుట్రలు
BAAP!!! #Jhund #JhundTeaser @SrBachchan https://t.co/q2ENhxrsKH
— Abhishek ???????? (@juniorbachchan) February 8, 2022