
త్రిగుణ్, మేఘా చౌదరి జంటగా మల్లి యేలూరి దర్శకత్వం వహించిన కామెడీ థ్రిల్లర్ ‘జిగేల్’. డా.వై. జగన్ మోహన్, నాగార్జున అల్లం నిర్మించారు. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మార్చి 7న సినిమా రిలీజ్ చేయనున్నట్టు శనివారం ప్రకటించారు.
ప్రేక్షకులు రెండున్నర గంటలపాటు ఎంజాయ్ చేసేలా ఈ చిత్రాన్ని రూపొందించామని నిర్మాతలు తెలియజేశారు. షాయాజీ షిండే, పోసాని కృష్ణమురళి, రఘు బాబు, పృథ్వీ రాజ్, మధునందన్, ముక్కు అవినాశ్ ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఆనంద్ మంత్ర సంగీతం అందిస్తున్నాడు.