దసరాకి ‘జిగ్రా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అలియా భట్. తాజాగా ఆమె నటిస్తున్న మరో మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్. అలియా, శార్వరి ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం ‘ఆల్ఫా’. శివ్ రావెల్ దర్శకత్వంలో యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను వచ్చే ఏడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల చేయనున్నట్టు శుక్రవారం ప్రకటించారు.
స్పై యూనివర్స్‌లో రాబోతున్న మొదటి మహిళా గూఢచారి చిత్రమిది. ఇందులో అలియా భట్ టైటిల్ పాత్ర పోషిస్తోంది. ఆమెతో పాటు మరో సూపర్ ఏజెంట్‌గా శార్వరి కనిపించనుంది. వీరితో పాటు అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్టన్నింగ్ విజువల్స్, ఇంటెన్స్ యాక్షన్స్‌తో ఎవరూ ఊహించని ట్విస్టులతో సినిమాను రూపొందిస్తున్నట్టు మేకర్స్ చెప్పారు.