JigraTrailer: తమ్ముడి కోసం అక్క పోరాటం...స్టన్నింగ్ యాక్షన్‌తో అలియా భ‌‌‌‌‌‌‌‌ట్ జిగ్రా ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

JigraTrailer: తమ్ముడి కోసం అక్క పోరాటం...స్టన్నింగ్ యాక్షన్‌తో అలియా భ‌‌‌‌‌‌‌‌ట్ జిగ్రా ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

అలియా భ‌‌‌‌‌‌‌‌ట్ (Alia Bhatt) లీడ్ రోల్‌‌‌‌‌‌‌‌లో నటించిన హిందీ చిత్రం ‘జిగ్రా’(Jigra). వాసన్ బాల దర్శకుడు. కరణ్ జోహార్,  అపూర్వ మెహతా, అలియా భట్, షాహీన్ భట్, సోమెన్ మిశ్రా నిర్మిస్తున్నారు. గురువారం సెప్టెంబర్ 26న  ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్‌‌‌‌‌‌‌‌తో యాక్షన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చూస్తుంటే అర్థమవుతోంది

 తమ్ముడిని రక్షించేందుకు దేనికైనా తెగించే అక్క పాత్రలో అలియా భట్ నటించింది. తమ్ముడిగా ‘ఆర్చీస్‌‌‌‌‌‌‌‌’ ఫేమ్ వేదాంగ్ రైనా నటించాడు.  రాహుల్ రవీంద్రన్ కీల‌‌‌‌‌‌‌‌క పాత్ర పోషించాడు. దసరా సందర్బంగా అక్టోబర్ 11న సినిమా విడుదల కానుంది.  ఇక ప్రస్తుతం ప్యారిస్‌‌‌‌‌‌‌‌లో ఉంది అలియాభట్. అక్కడ జరుగుతున్న ఫ్యాషన్ వీక్‌‌‌‌‌‌‌‌లో పాల్గొంది.

జిగ్రా సినిమాలో ఆలియా భట్ యాక్షన్ అవతార్ లో ఆకట్టుకుంది. పూర్తి స్థాయి యాక్షన్ క్యారెక్టర్ తో ఇప్పటి వరకు గతంలో ఎప్పుడూ లేని లుక్ లో కనిపించింది. తమ్ముడి కోసం ఆమె చేసే పోరాటం ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంటోంది. యాక్షన్, ఎమోషన్ తో నిండిన ట్రైలర్ ‘జిగ్రా’ మూవీపై భారీగా అంచనాలు పెంచుతోంది.

  • Beta
Beta feature