
పాకిస్తాన్ ప్రధానిగా ఎన్నికైన షెహబాజ్ షరీఫ్‌కు చైనా ప్రెసిడెంట్ షీ జిన్ పింగ్ అభినందనలు తెలిపారు. షెహబాజ్ నాయకత్వంలో పాకిస్తాన్ అభివృద్ధి చెందుతుందని, ఉన్నత శిఖరాలు అధిరోహిస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పాక్, చైనా ఒకరికొకరు సహకరించుకుంటూ అన్ని రంగాల్లో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని జిన్ పింగ్ పేర్కొన్నారు.